Viral Video: వాషింగ్ మెషిన్‌లో ఇరుక్కున్న మహిళను.. చిన్న టెక్నిక్‌తో ఈ పోలీసు ఎలా కాపాడాడో చూడండి..

ABN , First Publish Date - 2023-04-26T14:43:23+05:30 IST

అనూహ్య ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో కొందరు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎదుటి వారి ప్రాణాలను కాపాడుతుంటారు. చిన్న చిన్న టెక్నిక్‌లను ఉపయోగించి.. ఎంతో మందిని పెద్ద ప్రమాదాల నుంచి బయటపడేస్తుంటారు. ఇలాంటి..

Viral Video: వాషింగ్ మెషిన్‌లో ఇరుక్కున్న మహిళను.. చిన్న టెక్నిక్‌తో ఈ పోలీసు ఎలా కాపాడాడో చూడండి..

అనూహ్య ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో కొందరు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎదుటి వారి ప్రాణాలను కాపాడుతుంటారు. చిన్న చిన్న టెక్నిక్‌లను ఉపయోగించి.. ఎంతో మందిని పెద్ద ప్రమాదాల నుంచి బయటపడేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‍‪‌గా మారింది. ఓ మహిళ ప్రమాదవశాత్తు వాషింగ్ మెషిన్‌లో ఇరుక్కుంటుంది. అక్కడే ఉన్న పోలీసు.. చివరకు ఆమెను చిన్న టెక్నిక్‌తో కాపాడతాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ హల్‌చల్ (Viral videos) చేస్తోంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ మహిళ ప్రమాదవశాత్తు వాషింగ్ మెషిన్‌లో (woman stuck in a washing machine) ఇరుక్కుంటుంది. దాన్నుంచి బయటికి రాలేక.. ఇబ్బంది పడుతూ ఉంటుంది. పక్కనే ఉన్న మహిళ గమనించి.. సమీపంలో ఉన్న ఓ పోలీసును పిలుచుకుని వస్తుంది. అక్కడికి వచ్చిన పోలీసు (police) .. ముందుగా ఆమెకు.. భయపడవద్దంటూ ధైర్యం చెబుతాడు. తర్వాత ఆమె సులభంగా బయటికి వచ్చేలా శరీరంపై స్ప్రే చల్లుతాడు.

Viral Video: నడి రోడ్డుపై కారును కడుగుతున్న యువతి.. చివరకు అసలు విషయం తెలుసుకుని అవాక్కయిన వాహనదారులు..

తర్వాత ఆమెకు సూచనలు ఇస్తూ లోపలికి తోస్తాడు. లోపలికి వెళ్లిన మహిళ కాళ్లను బయటికి తీసి, సలభంగా రక్షిస్తాడు. బయటికి వచ్చిన మహిళ.. చివరగా తన ఆనందాన్ని వ్యక్తి చేసి, పోలీసుకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మహిళను కాపాడిన పోలీసుపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంత చేసుకుంది.

Viral News: ఈ ఇల్లు మాకొద్దంటున్నా.. దంపతులకు అద్దెకు ఇచ్చిన యజమాని.. 25 రోజుల తర్వాత వెళ్లి చూడగా.. వారు చేసిన నిర్వాకం..

Updated Date - 2023-04-26T14:43:23+05:30 IST