Viral Video: వధువు ఇంటికి వచ్చిన వరుడు.. వీడియోలు తీస్తూ ఉన్నట్టుండి ఓ యువకుడు చేసిన పనికి.. అంతా షాక్..

ABN , First Publish Date - 2023-04-23T18:55:26+05:30 IST

దంపతులకు తమ వివాహానికి సంబంధించిన సంతోషకర ఘట్టాలు.. జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ఇందుకోసమే చాలా మంది ఖర్చులకు వెనుకాడకుండా వివాహ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే..

Viral Video: వధువు ఇంటికి వచ్చిన వరుడు.. వీడియోలు తీస్తూ ఉన్నట్టుండి ఓ యువకుడు చేసిన పనికి.. అంతా షాక్..

దంపతులకు తమ వివాహానికి సంబంధించిన సంతోషకర ఘట్టాలు.. జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ఇందుకోసమే చాలా మంది ఖర్చులకు వెనుకాడకుండా వివాహ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే కొన్నిసార్లు దురదృష్టవశాత్తు చోటు చేసుకునే ఊహించని ఘటనలు.. దంపతులకు జీవితాంతం చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంటాయి. ప్రస్తుతం ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బంధువులందరితో కలిసి వరుడు.. వధువు ఇంటికి చేరుకున్నాడు. దీంతో చుట్టు పక్కల ఉన్న యువకులంతా తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడి అత్యుత్సాహం వల్ల విషాద ఘటన చోటు చేసుకుంటుంది.

సోషల్ మీడియాలో ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వీడియో (Viral videos) వైరల్ అవుతోంది. వివాహం (marriage) సందర్భంగా వధువు ఇంటి వద్ద ఘనంగా ఏర్పాట్లు చేసి ఉంటారు. ఇంతలో వరుడు (groom) తన బంధువులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా బంధువులతో పాటూ చుట్టు పక్కల వారంతా అక్కడ గుమికూడారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ క్రమంలో చాలా మంది యువతీయువకులు తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆనందకర సమయంలో అనుకోకుండా అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. వరుడితో పాటూ చాలా మంది అతిథులు గుంపులు గుంపులుగా నిలబడి ఉంటారు.

Viral Video: నడి రోడ్డుపై కారును కడుగుతున్న యువతి.. చివరకు అసలు విషయం తెలుసుకుని అవాక్కయిన వాహనదారులు..

పక్కనే ఎత్తుగా ఉన్న గోడపై నుంచి కొందరు వీడియోలు (Videos) తీస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తాడు. ఓ పెద్ద బండ రాయిని కాళ్ల ముందు నిలబెట్టుకుని వీడియోలు తీస్తుంటాడు. అయితే కాసేపటి తర్వాత అదుపు తప్పి బండ రాయి కింద ఉన్న (stone fell on the people) జనం మీద పడుతుంది. వరుడితో పాటూ పక్కన యువకుల తల మీద పడడంతో అంతా అరుపులు, కేకలు పెడతారు. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. ఈ ప్రమాదంలో చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘అయ్యో పాపం!.. ఓ ఆకతాయి వల్ల ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral News: ఈ ఇల్లు మాకొద్దంటున్నా.. దంపతులకు అద్దెకు ఇచ్చిన యజమాని.. 25 రోజుల తర్వాత వెళ్లి చూడగా.. వారు చేసిన నిర్వాకం..

Updated Date - 2023-04-23T18:55:26+05:30 IST