Viral Video: బైకు ఎక్కే స్టయిల్ బాగుంది.. కానీ చివర్లో ఇలా చేశావేంటీ..! యువతి విన్యాసంపై నెటిజన్ల సెటైర్లు..

ABN , First Publish Date - 2023-04-23T19:46:31+05:30 IST

ప్రస్తుతం యువతులు యువకులతో పోటాపోటీగా వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరి దృష్టిలో పడుతున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతి..

Viral Video: బైకు ఎక్కే స్టయిల్ బాగుంది.. కానీ చివర్లో ఇలా చేశావేంటీ..! యువతి విన్యాసంపై నెటిజన్ల సెటైర్లు..

సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో పిల్లలతో పాటూ పెద్దలు కూడా లైకులు, వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేయడం సర్వ సాధారణమైంది. బైకులో ప్రియురాలిని ఎక్కించుకుని పిచ్చి పనులు చేసే యువకులు, సిగ్గు.. బిడియం పక్కన పెట్టి జన సందోహం మధ్యలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించే యువతులను చాలా మందిని చూశాం. ప్రస్తుతం యువతులు యువకులతో పోటాపోటీగా వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరి దృష్టిలో పడుతున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతి చేసిన విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. స్టైల్ బైకు ఎక్కడానికి ప్రయత్నించిన యువతిని చూసి నెటిజన్లు ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ యువతికి సంబంధించిన వీడియో తెగ వైరల్ (Viral Videos) అవుతోంది. బైక్ స్టంట్స్ చేసేది మగవాళ్లేనా.. మేము చేయలేమా... అని అనుకుందో ఏమో గానీ.. ఓ యువతి వినూత్న విన్యాసం చేసేందుకు సిద్ధమైంది. స్టాండ్ వేసి ఉన్న బైకు పక్కన ఓ యువతి (young woman) స్టైల్‌గా నిలబడి ఉంటుంది. బైకు పైకి వినూత్నంగా ఎక్కాలని (Bike stunt) ఆమె ఉద్దేశం. తన స్నేహితురాలు కెమెరా ఆన్ చేసి, రెడీ అనగానే.. యువతి బైకు వద్దకు వస్తుంది. సీటు వద్దకు రాగానే ఒకసారి చుట్టూ తిరిగి స్టైల్‌గా కాలు పైకి లేపి, బైకుపై కూర్చోవాలని ప్రయత్నిస్తుంది.

Viral Video: నడి రోడ్డుపై కారును కడుగుతున్న యువతి.. చివరకు అసలు విషయం తెలుసుకుని అవాక్కయిన వాహనదారులు..

అయితే బైకు ఎత్తుగా ఉండడంతో కాలు ముందు వైపు తగులుకుని ధమేల్‌మని కిందపడుతుంది. ‘‘అమ్మో దేవుడా.. నొప్పి బాబోయ్!’’.. అని కాసేపు విలవిల్లాడిపోతుంది. ఈ స్టంటూ వద్దూ ఏమీ వద్దూ.. అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బైకు ఎక్కే స్టైల్ ఓకే.. చివర్లో చూసుకోవాలి కదమ్మా’’.. అని కొందరు, ‘‘రీల్స్ కోసమని సాధ్యం కాని విన్యాసాలు చేస్తే.. ఇలాగే జరుగుతుంది’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral News: ఈ ఇల్లు మాకొద్దంటున్నా.. దంపతులకు అద్దెకు ఇచ్చిన యజమాని.. 25 రోజుల తర్వాత వెళ్లి చూడగా.. వారు చేసిన నిర్వాకం..

Updated Date - 2023-04-23T19:46:31+05:30 IST