Car Insurance: గేదెలు కానీ ఆంబోతులు కానీ.. కారును ఢీకొట్టి పాడు చేస్తే.. ఇన్సూరెన్స్ వర్తిస్తుందా..? లేదా అంటే..!
ABN , First Publish Date - 2023-08-11T20:48:26+05:30 IST
నిత్యం వివిధ రకాల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. నిబంధనలు పాటించని కారణంగా కొన్నిసార్లు, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా మరికొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాహానాలకు గానీ, మనుషులకు గానీ ఏం జరిగినా.. ఇన్సూరెన్స్ చేసి ఉన్నట్లయితే..
నిత్యం వివిధ రకాల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. నిబంధనలు పాటించని కారణంగా కొన్నిసార్లు, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా మరికొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాహానాలకు గానీ, మనుషులకు గానీ ఏం జరిగినా.. ఇన్సూరెన్స్ చేసి ఉన్నట్లయితే నష్టపరిహారం అందుతుంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఒకవేళ వాహనాలను ఆవులు, గేదెలు ఢీకొట్టి పాడు చేసినా ఇన్సూరెన్స్ వర్తిస్తుందా.. లేదా.. అన్న విషయంలో చాలా మందికి సందేహం ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం.. పదండి..
సాధారణంగా ఎవరైనా కారు తీసుకున్న వెంటనే ఇన్సూరెన్స్ విధిగా చేయిస్తుంటారు. అయితే దాన్ని రెన్సువల్ చేయించే క్రమంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొందరు క్రమం తప్పకుండా రెన్సువల్ చేయించినా.. ఏ రకమైన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే.. ఏ రకమైన ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను మాత్రం తెలుసుకోరు. ఎక్కువగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ (Third Party Insurance) పాలసీలు చేయించడం చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి పాలసీ చేసిన వారి వాహనాలకు.. జంతువుల వల్ల నష్టం జరిగితే బీమా కంపెనీలు ఎలాంటి నష్టపరిహారం చెల్లించదు. కేవలం సమగ్ర బీమా పాలసీ (Comprehensive insurance policy) చేయించిన వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. జంతువులు (Animals) లేదా ఇతర కారణాల వల్ల వాహనానికి నష్టం వాటిళ్లితే సమస్య బీమా పాలసీ కింద కవర్ చేయబడుతుంది.
కొందరు వాహనదారులు జంతువును రక్షించే క్రమంలో రోడ్డుపై ఇంకొక వస్తువునో, జంతువునో ఢీకొడుతుంటారు. ఇలాంటి సమయంలో జరిగే నష్టాలను బీమా కంపెనీ (Insurance company) భర్తీ చేస్తుంది. అదేవిధంగా చాలా మంది తమ పెంపుడు జంతువులను తమ వాహనాల్లో తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో వాటి వల్ల వాహనాలకు ఎలాంటి నష్టం జరిగినా బీమా కంపెనీలు నష్ట పరిహారం (Damage compensation) చెల్లిస్తాయి. అదేవిధంగా మీ వాహనాలను ఎలుకలు పాడు చేసినా, లేదా పక్షుల కారణంగా నష్టం జరిగినా కూడా బీమా వర్తిస్తుంది. దీంతో పాటూ తుఫాను, భూకంపం, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకూ పరిహారం అందించబడుతుంది. అయితే ఇది కేవలం సమగ్ర బీమా పాలసీ తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పటిదాకా మీరు ఇలాంటి పాలసీ చేయకపోతే వెంటనే చేయించుకోండి మరి.