Viral Video: పోలీస్ స్టేషన్ ముందు స్కూటీని ఆపి.. ఓ మహిళ వింత నిర్వాకం.. డబ్బుల్ని నడిరోడ్డుపై విసిరేస్తూ..!
ABN , First Publish Date - 2023-11-24T16:29:37+05:30 IST
బస్సులు, రైళ్లలో మహిళలు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. కొందరు సీటు కోసం అందరితోనూ గొడవ పడితే.. మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
బస్సులు, రైళ్లలో మహిళలు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. కొందరు సీటు కోసం అందరితోనూ గొడవ పడితే.. మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ నిర్వాకానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పోలీస్ స్టేషన్ ఎదుట స్కూటీని ఆపిన మహిళ.. ఉన్నట్టుండి రోడ్డుపై డబ్బుల్ని విసిరేయడం మొదలెట్టింది. మహిళ వింత నిర్వాకంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చివరకు అసలు విషయం తెలుసుకుని.. అయ్యో పాపం.. అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) నీముచ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బీచ్ రోడ్‌లోని కాంట్ పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ మరోసారి వీరంగం సృష్టించింది. స్కూటీపై అక్కడికి వచ్చిన ఆమె అంతా చూస్తుండగా.. బండిని రోడ్డు మధ్యలో ఆపి స్టేషన్ గేటు ఎదురుగా నిల్చుంది. ఏం చేస్తుందబ్బా.. అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చేతిలోని ప్లాస్టిక్ కవర్‌ను బయటికి తీసింది. అందులోని రూ.500 నోట్లను బయటికి తీసి, రోడ్డుపై వెదజల్లడం మొదలెట్టింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. కొందరైతే అలాగే చూస్తూ ఉండిపోయారు.
అక్కడ ఉన్న కొందరు కలుగుజేసుకుని.. అలా చేయొద్దమ్మా... అని చెబుతున్నా ఆమె మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా (woman throwing currency notes on the road) నోట్లను విసిరేస్తూనే ఉంది. కాసేపటికి తర్వాత ఓ వ్యక్తి అక్కడికి వచ్చి కింద పడ్డ నోట్లను సేకరించి మహిళకు ఇచ్చే ప్రయత్నం చేశాడు. తర్వాత పో కానిస్టేబుల్ అక్కడికి వచ్చి.. ఆమె గురించి పక్కన ఉన్న వాళ్లకు తెలియజేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. సదరు మహిళ మానసిక వ్యాధితో (mental illness) ఇబ్బంది పడుతోంది. జూన్ నెలలోనూ ఇలాగే పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి.. నోట్లను వెదజల్లింది. కొడుకు తనను చీటికీమాటికీ కొడుతూ ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే దీనిపై విచారించగా.. అందులో ఆరోపణలు నిజం కావని, ఆమె మానసిక సమస్యతో ఇబ్బంది పడుతోందిన తెలిసింది. దీంతో పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన మహిళ అప్పట్లో ఇలాగే రోడ్డుపై కరెన్సీ నోట్లను వెదజల్లింది. పోలీసులు లంచం ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారని, అందుకే ఇలా నోట్లను వెదజల్లుతున్నట్లు చెప్పింది. ఇప్పుడు ప్రజలు తనను ఇబ్బంది పెడుతున్నారని, అయినా పోలీసులు స్పందించలేదంటూ నోట్లను విసిరేయడం మొదలెట్టింది. ఈమె గురించి తెలుసుకున్న వారిలో కొందరు అయ్యో పాపం!.. అంటూ ఆమెపై సానుభూతి వ్యక్తం చేశారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఆమెకు సరైన వైద్య చికిత్స చేయించాలని కామెంట్లు చేస్తున్నారు.