India Playing XI vs BAN: శార్దూల్ ఠాకూర్‌ను తప్పిస్తారా?.. బంగ్లాదేశ్‌తో పోరుకు టీమిండియా తుది జట్టు ఇదే!
ABN , First Publish Date - 2023-10-18T11:12:55+05:30 IST
సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత్ మరో పోరుకు సిద్ధమవుతోంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే మ్యాచ్ వేదికైన పుణే చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది.
పుణె: సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత్ మరో పోరుకు సిద్ధమవుతోంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే మ్యాచ్ వేదికైన పుణే చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. ప్రపంచకప్‌లో వరుసగా పెద్ద జట్టకు చిన్న జట్లు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న వేళ బంగ్లాదేశ్‌ను ఏ మాత్రం తేలికగా తీసుకోకూడదని టీమిండియా భావిస్తోంది. పైగా ఇటీవల బంగ్లాదేశ్‌పై మన జట్టు రికార్డు కూడా ఏమంతంగా బాగాలేదు. బంగ్లాదేశ్‌తో ఆడిన చివరి 4 వన్డేల్లో మన జట్టు ఏకంగా 3 ఓడిపోయింది. ఆసియాకప్‌లోనూ బంగ్లా చేతిలో భారత జట్టు ఓటమిపాలైంది. అందుకే బంగ్లాదేశ్‌ను ఏ మాత్రం తేలికగా తీసుకోకుండా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగబోతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా బ్యాటింగ్ యూనిట్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎవరన్న గాయపడితే తప్ప లేదంటే పాకిస్థాన్‌తో ఆడిన బ్యాటింగ్ యూనిటే బరిలోకి దిగనుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. వన్ డౌన్‌లో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కొనసాగనున్నారు. అయితే పిచ్ స్వభావాన్ని బట్టి బౌలింగ్ యూనిట్‌లో ఒకటి రెండు మార్పులు జరిగే అవకాశాలున్నాయి. పుణె పిచ్ సాధారణంగా స్పిన్‌కు అనుకూలిస్తుంది. కానీ ఇటీవల కాలంలో పేసర్లకు కూడా సహకారం లభిస్తుంది. కాబట్టి మ్యాచ్‌కు ముందు పిచ్‌ను పరిశీలించి తుది జట్టును ఎంపిక చేయనున్నారు. పిచ్ స్పిన్‌కు అనుకూలించే పరిస్థితులుంటే అశ్విన్ తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు శార్దూల్ ఠాకూర్ బెంచ్‌కు పరిమితం అవుతాడు. అలా కాకుండా పేస్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశాలుంటే శార్దూల్ ఠాకూర్ కొనసాగొచ్చు. లేదంటే అతని స్థానంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి చోటు కల్పించే అవకాశాలున్నాయి. నిజానికి ఈ సారి ఈ మార్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శార్దూల్‌ను బ్యాటింగ్ కోసం జట్టులోకి తీసుకుంటున్నప్పటికీ ఇప్పటివరకు అతను ఆడే అవకాశం రాలేదు. మరోవైపు షమీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మాజీలు కూడా షమీని ఆడించాలని చెబుతున్నారు. దీంతో పిచ్ సీమర్లకు అనుకూలిస్తే ఈ మ్యాచ్‌లో శార్దూల్ కంటే షమీ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక మిగతా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో కొనసాగనున్నారు. సాధారణంగా పుణె పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. దీంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి.
టీమిండియా తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్