IND vs NED: టాస్ మనదే! టీమిండియా తుది జట్టు ఎలా ఉందంటే..?
ABN , First Publish Date - 2023-11-12T13:45:52+05:30 IST
India vs Netherlands: చివరి లీగ్ పోటీలో భాగంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా ఐర్లాండ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ హెడ్స్ హెడ్స్ చెప్పాడు. కానీ కాయిన్ టేల్స్ పడింది. దీంతో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. అటు నెదర్లాండ్స్ జట్టు కూడా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ఆడుతోంది.
బెంగళూరు: చివరి లీగ్ పోటీలో భాగంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా ఐర్లాండ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ హెడ్స్ హెడ్స్ చెప్పాడు. కానీ కాయిన్ టేల్స్ పడింది. దీంతో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. అటు నెదర్లాండ్స్ జట్టు కూడా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ఆడుతోంది. ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో భారత్, నెదర్లాండ్స్ మధ్య రెండు మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఆ రెండింటిలో టీమిండియానే గెలిచింది. ఈ టోర్నీలో ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న టీమిండియా సెమీఫైనల్‌కు ముందు ఈ మ్యాచ్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అలాగే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి లీగ్ దశలో ఒక ఓటమి కూడా లేకుండా సెమీస్ పోరుకు సిద్ధం కావాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. లీగ్ దశలో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. కాగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ నెల 15న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. 16న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
నెదర్లాండ్స్: వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్ కీపర్/కెప్టెన్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్