ODI World Cup: ప్చ్.. హైదరాబాద్‌లో టీమిండియా మ్యాచ్ ఒక్కటీ లేదు..
ABN , First Publish Date - 2023-06-27T13:33:59+05:30 IST
ప్రపంచకప్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసిన హైదరాబాద్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నప్పటికీ టీమిండియాకు మాత్రం ఒక మ్యాచ్ కూడా లేదు. లీగ్ స్టేజ్‌లో భారత జట్టు 9 మ్యాచ్‌లు ఆడనుండగా.. 9 వేర్వేరు వేదికలపై ఆడనుంది. కానీ అందులో మన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం లేదు.
ప్రపంచకప్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసిన హైదరాబాద్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నప్పటికీ టీమిండియా మాత్రం ఒక మ్యాచ్ కూడా ఆడడం లేదు. లీగ్ స్టేజ్‌లో భారత జట్టు 9 మ్యాచ్‌లు ఆడనుండగా.. 9 వేర్వేరు వేదికలపై ఆడనుంది. కానీ అందులో మన హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం లేదు. ఒక వేళ భారత జట్టు సెమీ ఫైనల్, ఫైనల్ చేరినప్పటికీ టీమిండియాను హైదరాబాద్‌లో చూసే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లను హైదరాబాద్‌లో నిర్వహించడం లేదు.
నిజానికి మొదట భారత్, పాకిస్థాన్ మ్యాచ్ హైదరాబాద్‌లోనే జరగనుందనే వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాలేదు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. దీంతో హైదరాబాద్‌లో టీమిండియా ప్రపంచకప్ ఆడడాన్ని చూడాలని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. కాగా ప్రపంచకప్ మ్యాచ్‌లను మొత్తం 10 వేదికలలో నిర్వహిస్తున్నారు. మిగతా 9 వేదికలలో భారత జట్టు మ్యాచ్ లు ఆడనుంది. ఒక్క హైదరాబాద్ లోనే టీమిండియా మ్యాచ్ లేకపోవడం గమనార్హం.
కాగా హైదరాబాద్‌లో లీగ్ స్టేజ్‌లోని 3 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ జట్టు ఉప్పల్‌లో రెండు మ్యాచ్‌లు ఆడనుండడం గమనార్హం. అక్టోబర్ 6న జరగనున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు క్వాలిఫైయర్ 1 జట్టుతో ఆడనుంది. అక్టోబర్ 9న న్యూజిలాండ్ జట్టు క్వాలిఫైయర్ 1 జట్టుతో ఉప్పల్‌లోనే ఆడనుంది. అక్టోబర్ 12న పాకిస్థాన్ జట్టు క్వాలిఫైయర్ 2 జట్టుతో ఆడనుంది. ఈ మ్యాచ్‌తో హైదరాబాద్‌లో ప్రపంచకప్ మ్యాచ్‌లు ముగియనున్నాయి.