Bandi Sanjay: ‘తెలంగాణ తలవంచదు కాదు కవిత.. తలవంచుకునేలా చేశావు’

ABN , First Publish Date - 2023-03-08T15:07:43+05:30 IST

బీజేపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Bandi Sanjay: ‘తెలంగాణ తలవంచదు కాదు కవిత.. తలవంచుకునేలా చేశావు’

హైదరాబాద్: బీజేపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోని కరెంట్ లేని గ్రామాలకు మోదీ ప్రభుత్వం (Modi Government) విద్యుత్ ఇస్తోందన్నారు. తెలంగాణ (Telangana) మొదటి ప్రభుత్వంలో మహిళా మంత్రి లేరని విమర్శించారు. బీఆర్ఎస్‌ (BRS)కు మహిళా వింగ్ ఉందో లేదో తెలియదన్నారు. బతుకమ్మ పేరుతో కవిత తెలంగాణ కల్చర్‌ను దెబ్బతీశారని మండిపడ్డారు. బతుకమ్మ దగ్గర డీజే, డిస్కో డ్యాన్సులు చేసే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. దొంగ సారా, చీప్ లిక్కర్ అమ్మితే.. అరెస్ట్ చేయరా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం తల వంచుకునే పరిస్థితిని కవిత తీసుకొచ్చారని విమర్శించారు. ‘‘తెలంగాణ తల వంచదు కాదు కవిత.. తల వంచుకునేలా చేశావు’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు కవిత ఏమన్నారంటే... ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi liquor Scam) లో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 9న విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ నోటీసులో పేర్కొంది. దీనిపై స్పందించిన కవిత..‘‘తెలంగాణ తల వంచదు’’ అంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది. ఈ క్రమంలోనే మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ నాకు నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటాము. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాము. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికార కాంక్షాపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాము’’ అని కవిత పేర్కొన్నారు.

Updated Date - 2023-03-08T15:07:43+05:30 IST