Dharmapuri Arvind: ఉచిత విద్యుత్‌పై రచ్చ... రేవంత్‌ను ధర్మపురి అరవింద్ ఎంత మాట అనేసారో చూడండి...
ABN , First Publish Date - 2023-07-13T16:13:36+05:30 IST
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అంశం ఒక్కసారిగా పొలిటికల్ హీట్‌ను పెంచేసింది. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఉచిత విద్యుత్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
హైదరాబాద్: రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అంశం ఒక్కసారిగా పొలిటికల్ హీట్‌ను పెంచేసింది. ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఉచిత విద్యుత్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ నిజామాబాద్ ఎంపీ ఏమాన్నారంటే.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత విద్యుత్‌పై కోమటరెడ్డి వెంకటరెడ్డి తప్పా?.. రేవంత్ రెడ్డి కరెక్టా? చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. రేవంత్ రెడ్డి బిజినెస్ పార్టనర్స్ అని అన్నారు. మూడు గంటలు కరెంట్ చాలని రేవంత్ రెడ్డికి ఏ రైతు చెప్పారని ప్రశ్నించారు. కేసీఆర్ ఆడిస్తే.. రేవంత్ రెడ్డి ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. రాజకీయంగా రేవంత్ రెడ్డిని పెంచాలో.. తగ్గించాలో.. అంతా కేసీఆర్ చెప్పినట్లు నడుస్తోందని అన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ డబ్బులు పంపుతున్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ బీ ఫాంలు సీఎం కేసీఆర్ చేతి నుంచే వెళ్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వెళ్ళరని రేవంత్ రెడ్డి గ్యారంటీ ఇవ్వగలరా అంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్ చేశారు.
ఆ ఇద్దరు మంత్రులు యూజ్‌లెస్ ఫెలోస్...
అలాగే.. కల్వకుంట్ల ఫ్యామిలీపై ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం ముఖంపై నల్ల కాకి కూడా రెట్ట వేయటానికి ఇష్టపడదన్నారు. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లను యూజ్ లెస్ ఫెలోస్ అంటూ ఫైర్ అయ్యారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వటం లేదని ఇంకోసారి అంటే కేటీఆర్ దవడ పళ్ళు ఊడగొడతా అంటూ మండిపడ్డారు. మంత్రి హరీష్ రావు యూజ్ లెస్ ఫెలో అని... సిద్దిపేట ఆసుపత్రికి వంద కోట్లు తీసుకెళ్ళారని అన్నారు. తెలంగాణ ప్రజల రక్తం పీల్చుకుంటూ కల్వకుంట్ల కుటుంబాన్ని పోషించుకుంటున్నారని విమర్శించారు. తన చెల్లి కవిత జైలుకు పోవాలని కేటీఆర్ కోరుకుంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్ చరిత్ర ప్రజల ముందుంచుతానని... కేటీఆర్ ది నోరా? మోరీనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజ్‌ల నిధుల విషయంలో సిగ్గులేని హరీష్ రావు అబద్ధాలు చెప్తున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన వంద కోట్లతోనే కేటీఆర్ సిరిసిల్ల రింగ్ రోడ్డు వేసుకున్నారన్నారు. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లు మనుషులా.. పశువులా? అంటూ విరుచుకుపడ్డారు. కేంద్రం నిధులు ఇవ్వటం లేదని తెలంగాణ మంత్రులు అంటున్నారని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశానని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.