CPI Narayana: దేశాన్ని మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోం
ABN , Publish Date - Dec 26 , 2023 | 03:16 PM
దేశాన్ని మోదీ ప్రభుత్వం ( Modi Govt ) విచ్ఛిన్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని సీపీఐ ( CPI ) జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) హెచ్చరించారు. మంగళవారం నాడు సీపీఐ కార్యాలయంలో సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు, నారాయణ, చాడా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ‘‘బీజేపీ ప్రమాదకర సిద్ధాంతాలతో, ఆలోచనలతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అయోధ్య రామమందిరానికి నాంది పలికిoది ఎల్కే అద్వానీ.. కానీ అదే ఆద్వానిని రామ మందిర ప్రారొంభోత్సవానికి రావొద్దని చెప్పారు’’ అని నారాయణ తెలిపారు.
హైదరాబాద్: దేశాన్ని మోదీ ప్రభుత్వం ( Modi Govt ) విచ్ఛిన్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని సీపీఐ ( CPI ) జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) హెచ్చరించారు. మంగళవారం నాడు సీపీఐ కార్యాలయంలో సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు, నారాయణ, చాడా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ‘‘బీజేపీ ప్రమాదకర సిద్ధాంతాలతో, ఆలోచనలతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అయోధ్య రామమందిరానికి నాంది పలికిoది ఎల్కే అద్వానీ.. కానీ అదే ఆద్వానిని రామ మందిర ప్రారొంభోత్సవానికి రావొద్దని చెప్పారు. బీజేపీ మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్. క్రిమినల్ గ్యాంగ్, మోదీ, అమిత్ షా, క్రిమినల్ గ్యాంగ్ దేశాన్ని పరిపాలిస్తోంది. దేశ సంపదను ఆదానీ చేతికి అప్పగించారు. లెఫ్ట్ వింగ్ ప్రమాదకరమని చెబుతున్నారు. ఉప చట్టాలను మరింత ప్రమాదకరoగా తయారుచేస్తున్నారు. దేశానికి రైట్ వింగ్ ప్రమాదకరమా..? లెఫ్ట్ వింగ్ ప్రమాదకరమా అనేది తెల్సుకోవాల్సిన అవసరం ఉంది’’ అని నారాయణ తెలిపారు.
మోదీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు.
‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. మనుధర్మాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌తో పాటు విచారణ సంస్థలను పెంపుడు కుక్కల్లా తయారు చేశారు. ఇండియా పేరు చూసి మోదీ ప్రభుత్వం భయపడుతోంది. విద్యా వ్యవస్థను పూర్తిగా కాషాయ మయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పార్లమెంట్‌పై దాడి జరిగింది. దాడి చేసిన వారికి బీజేపీ ఎంపీ పాసులు ఎట్లా ఇచ్చారు..? పాసులిచ్చిన బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోకుండా నిరసన తెలిపిన సభ్యులను సస్పెండ్ చేశారు. పై స్థాయిలో బిల్లులను అమోదించుకోవడానికి పార్లమెంట్‌పై దాడికి ప్లాన్ చేసుకున్నారు. దేశాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి మోదీ ప్రజాస్వామ్యాన్ని తెచ్చెందుకు ప్రయత్నం చేస్తున్నారు.. కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వ కార్డు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుర్తింపు ఉంటుంది’’ అని నారాయణ పేర్కొన్నారు.
సోవియట్ విప్లవం ఒక గుణాత్మకమైన మార్పు
‘‘1917కు ముందు విశ్వంలో ఒకే గ్లోబ్ ఉండేది. 1917 సోవియట్ విప్లవం వచ్చిన తర్వాత విశ్వంలో ఒక ఎర్ర చుక్క పొడిచింది. సోవియట్ విప్లవం ఒక గుణాత్మకమైన మార్పు. బ్రిటిష్ దొరలను తరమాలని అనుకున్నారు తప్ప ఎలాంటి స్వాతంత్ర్యం కావాలని ఎవరు అనుకోలేదు. దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన తర్వాతే స్పష్టమైన స్వాతంత్ర్య రాజ్యాంగ దేశం ఏర్పడింది. వారసత్వ ఉద్యమం స్ఫూర్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది. దేశ స్వాతంత్య్రలో కమ్యూనిస్ట్ పార్టీ వేలాదిమంది అమరవీరులను పోగొట్టుకుంది. స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పార్టీ పాత్ర లేదు. కులాలు, మతాల పేరు మీద దేశం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది. ఈరోజు దేశం విచ్ఛిన్నo చేసేందుకు విభజించు పాలించు అనే పద్ధతిలో పాలక గణాలు, ప్రభుత్వాలు ఉన్నాయి. దేశం ఐక్యంగా ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వంలా దేశం బలంగా ఉండాలి. దున్నే వాడికి భూమి కావాలనే ఉద్యమం నుంచి సాయుధ పోరాటంతో వరకు దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక నిర్భాందాలను ఎదుర్కొన్నది’’ అని నారాయణ తెలిపారు.