KTR : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇన్ సైడ్ కథనంతో రంగంలోకి కేటీఆర్
ABN , First Publish Date - 2023-07-01T10:26:49+05:30 IST
తెలంగాణలో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ సమయంలో ఏదైనా పార్టీలో అసంతృప్తితో ఉన్నవారంతా మరో పార్టీలోకి జంప్ అవడం సర్వసాధారణం. ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్, బీజేపీల నుంచి జంపింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి.
మహబూబాబాద్ : తెలంగాణలో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ సమయంలో ఏదైనా పార్టీలో అసంతృప్తితో ఉన్నవారంతా మరో పార్టీలోకి జంప్ అవడం సర్వసాధారణం. ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్, బీజేపీల నుంచి జంపింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తమ పార్టీ నేతలు జంప్ అవుతారని చిన్న అనుమానం వచ్చినా కూడా వారిని కాపాడుకునేందుకు పార్టీ కీలక నేతలు శతవిధాలుగా యత్నిస్తున్నారు.
ఇక డోర్నకల్ బీఆర్ఎస్ నేత నూకల నరేష్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇన్ సైడ్ కథనాన్ని వెలువరించింది. నూకల నరేష్ రెడ్డిపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభావం ఉంటుందని ఏబీఎన్‌లో కథనం ప్రసారమైంది. దీంతో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. నిన్న మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్ నూకల నరేష్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. నరేష్ రెడ్డిని బుజ్జగించే యత్నం చేశారు. పార్టీలో ఏం కావాలో చెప్పాలని నరేష్ రెడ్డిని కేటీఆర్ కోరినట్టుగా తెలుస్తోంది. పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని.. పార్టీని వీడొద్దని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం.