Asaduddin Owaisi: ‘కేసీఆర్‌ కుటుంబాన్ని వేధించడంలో మోదీ బిజీ’.. కవితకు అసదుద్దీన్ మద్దతు

ABN , First Publish Date - 2023-03-11T10:50:32+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణను ఎదుర్కోనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతుగా నిలిచారు.

Asaduddin Owaisi: ‘కేసీఆర్‌ కుటుంబాన్ని వేధించడంలో మోదీ బిజీ’.. కవితకు అసదుద్దీన్ మద్దతు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi liquor Scam) లో ఈడీ విచారణ (ED investigation)ను ఎదుర్కోనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (MIM Chief Asaduddin Owaisi) మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘బీజేపీ ఎంపీలు ముస్లింలను ఆర్థికంగా బైకార్ట్ చేయాలని పిలుపునిచ్చారు. కానీ మోదీ ప్రభుత్వం అంతర్గత అభివృద్ధి కొరకు కేసీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని వేధించడంలో బిజీగా ఉన్నది’’ అంటూ అసదుద్దీన్ సెటైరికల్ ట్వీట్ చేశారు.

కాగా.. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో కాసేపటి క్రితం ఢిల్లీలోని కేసీఆర్‌ నివాసంలో మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావుతో కవిత భేటీ అయ్యారు. భేటీ అనంతరం కవిత ఈడీ ఆఫీసుకు బయలుదేరనున్నారు. లాయర్‌తో కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అయితే కవితతో పాటు లాయర్‌ను అనుమతిస్తారా లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది. కవిత కారుతో పాటు మరో వాహనానికి మాత్రమే అనుమతి ఉంది.

మరోవైపు కవితకు మద్దతుగా బీఆ‌ర్‌ఎస్ మంత్రులు, ఎంపీలు, కార్యకర్తలు హస్తినకు చేరుకున్నారు. శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మలోత్ కవిత, కేకే, బిబి పాటిల్, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పట్నం మహీందర్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, సహా పలువురు బీఆర్ఎస్ ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకుని కవితను కలిశారు.

Updated Date - 2023-03-11T10:50:32+05:30 IST