Share News

Minister Uttam: మేడిగడ్డ బ్యారేజ్‌లో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు

ABN , First Publish Date - 2023-12-11T17:17:09+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్‌( Medigadda (Lakshmi) Barrage ) లో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) హెచ్చరించారు. సోమవారం నాడు జలసౌధలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Minister Uttam: మేడిగడ్డ  బ్యారేజ్‌లో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్‌( Medigadda (Lakshmi) Barrage ) లో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) హెచ్చరించారు. సోమవారం నాడు జలసౌధలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై మంత్రి చర్చించారు. ఈ సమావేశంలో ఈఎన్సీ మురళీధరతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల వారీగా మంత్రి ఉత్తమ్ సమీక్ష చేశారు. ప్రాజెక్టులకు అవుతున్న విద్యుత్ వినియోగంపై మంత్రి ఆరా తీశారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులపై లోతుగా సమీక్ష జరిపారు. ఈ శాఖకు సంబంధించిన అధికారులతో మంత్రి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

ఇరిగేషన్ శాఖపై ఉత్తమ్ ముందు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం, మేడిగడ్డపై ఉత్తమ్ ప్రత్యేకంగా వివరాలు అడిగారు. త్వరలో మేడిగడ్డ బ్యారేజ్‌ని పరిశీలించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... మేడిగడ్డ విషయంలో విచారణ జరగాలి. నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలి. ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నాం. మనం పూర్తిగా బాధ్యతాయుతంగా, జవాబు దారి తనంతో పని చేయాలి.తెలంగాణలో నీటి పారుదల రంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. అది గుర్తు పెట్టుకొని మనం పని చేయాలి. ప్రజల్లో నీటి పారుదల రంగంపై ఉన్న అపోహలు తొలగిపోయేలా పని చేయాలి’’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-12-11T17:23:37+05:30 IST