KTR : ఇల్లందు అన్నపూర్ణకు అండగా నిలిచిన కేటీఆర్
ABN , Publish Date - Dec 24 , 2023 | 11:08 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు ( Yellandu ) నియోజకవర్గానికి చెందిన అన్నపూర్ణ ( Annapurna )కు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) అండగా నిలిచారు. ప్రజాదర్బార్‌లో పలుమార్లు తన సమస్యను విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో ఆమె దిక్కుతోచక అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలవడానికి ప్రయత్నించింది. కానీ పోలీసులు ఆమె గోడు వినకుండా అక్కడి నుంచి పంపించివేశారు. ఇది చూసినా కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌ని కలవాలని సలహా ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు ( Yellandu ) నియోజకవర్గానికి చెందిన అన్నపూర్ణ ( Annapurna )కు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) అండగా నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్‌లో పలుమార్లు తన సమస్యను విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె దిక్కుతోచక అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) ని కలవడానికి ప్రయత్నించింది. కానీ పోలీసులు ఆమె గోడు వినకుండా అక్కడి నుంచి పంపించివేశారు. ఇది చూసినా కొంతమంది బీఆర్ఎస్ ( BRS ) నేతలు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌ని కలవాలని సలహా ఇచ్చారు. దీంతో ఆమె ఆదివారం నాడు తెలంగాణ భవన్లో కేటీఆర్‌ని కలిశారు. అన్నపూర్ణ బాధలు విన్న తర్వాత, ఆమె కూతురు నర్సింగ్ చదువు కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందించారు. బంజారాహిల్స్‌లో ఉన్న తన ఇంటికి పిలుచుకొని మరి చెక్కు అందజేశారు. తన కూతురు విద్య కోసం, కుటుంబ ఆర్థిక సహాయం కోసం సహకారం అందించిన కేటీఆర్‌కి ఇల్లందు అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపింది.