DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధం

ABN , First Publish Date - 2023-10-04T15:46:27+05:30 IST

కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress, BRS) పార్టీలది ఫెవికాల్ బంధమని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ(DK Aruna) ఆరోపించారు.

DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధం

మహబూబ్‌నగర్: కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress, BRS) పార్టీలది ఫెవికాల్ బంధమని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ(DK Aruna) ఆరోపించారు. బుధవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఇస్టానుసారం మాట్లాడితే బీఆర్ఎస్ నేతల నాలుకలకు మడత పెట్టి కుట్లేస్తాను. తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టే అర్హత మోదీకి లేదనేవారు సన్యాసులు. కల్వకుంట్ల కుటుంబం కాదది.. కంత్రీ కుటుంబం. ముఖ్యమంత్రి కాదు చీటర్‌రావు. కేటీఆర్ కాదు కంత్రీ కార్యకలాపాలరావు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఓటుకు నోటు కేసులో‌ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని సీఎం కేసీఆర్ కాపాడుతున్నారు. గెలిచినోళ్లను కూడా కాపాడుకోలేని కాంగ్రెస్.. ప్రజలకేమి గ్యారంటీ ఇస్తోంది? కవితతో ఉన్న అవినాభావ సంబంధం ఏంటో రేవంత్‌రెడ్డి చెప్పాలి? ప్రధాని ఎందుకు క్షమాపణ చెప్పాలో రేవంత్ చెప్పాలి? ప్రధానిపై బీఆర్ఎస్ నేతల చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాను. సంక్షేమ పథకాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ప్రధాని మోదీపై కేసీఆర్ కుటుంబం అహంకారపూరిత మాటలు దుర్మార్గం.

కేసీఆర్.. కుటుంబానికి అన్నీ లక్షల‌ కోట్లు ఎలా వచ్చాయి? ఒకప్పుడు సిద్దిపేట ప్రజలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది. తెలంగాణ కేసీఆర్ అబ్బ జాగీరు కాదు.‌. తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్‌కు లేదు. ఆత్మహత్యలకు ఉసిగొల్పి.. ఉద్యమంలో ప్రాణాలు తీసిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిది.మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడానికే.. టీఆర్ఎస్‌ను కేసీఆర్ బీఆర్ఎస్‌గా మార్చారు. తెలంగాణకు తొమ్మిదేళ్లల్లో కేంద్రం 9లక్షల‌ కోట్ల నిధులిచ్చింది.తెలంగాణ మోడల్ అంటే.. అవినీతి మోడల్. లోపాయికారి ఒప్పందంతో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రజలను మోసం చేసి గెలుస్తామని రేవంత్‌రెడ్డి అనటాన్ని ప్రజలు గమనించాలి’’ అని డీకే అరుణ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-04T15:46:27+05:30 IST