Minister Jagdish Reddy: నల్గొండలో బీఆర్ఎస్ గాలి వీస్తోంది
ABN , First Publish Date - 2023-10-11T20:51:21+05:30 IST
నల్గొండలో బీఆర్ఎస్(BRS) గాలి వీస్తోందని మంత్రి జగదీష్‌రెడ్డి (Minister Jagdish Reddy) అన్నారు.
హైదరాబాద్: నల్గొండలో బీఆర్ఎస్(BRS) గాలి వీస్తోందని మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagdish Reddy) అన్నారు. బుధవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘సమైఖ్య పాలనలో నల్లగొండ జిల్లా వెనకబడింది. తాగునీరు లేక ఫ్లోరోసిస్ బారిన పడింది. వేలాది మంది రైతులు నీళ్లు, కరెంట్ లేక ఆగమయ్యారు. కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉండేవి. చుక్క నీటి కోసం గోస పడ్డాం. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మన బతుకులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. కేసీఆర్ పాలనలో నల్లగొండ సుభీక్షంగా ఉంది. ఈ అభివృద్ధి ఇలాగే సాగాలంటే కేసీఆర్, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి. 60 ఏళ్లలో చేయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు.. ఏదో చేస్తామని ఆ పార్టీ నాయకులు వస్తున్నారు. కాంగ్రెస్ నేతలను నమ్మకండి, మళ్లీ బీఆర్ఎస్కే అధికారం ఇవ్వండి’’ అని మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.