Share News

AP Politics: భూమన కరుణాకర్‌రెడ్డిని టీటీడీ చైర్మన్ పదవీ నుంచి తొలగించాలి: భానుప్రకాష్ రెడ్డి

ABN , Publish Date - Apr 11 , 2024 | 10:02 PM

టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) తన కుమారుడి కోసం ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని.. వెంటనే ఆయనను ఆ పదవీ నుంచి తొలగించాలని బీజేపీ (BJP) నేత భానుప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) డిమాండ్ చేశారు. గురువారం నాడు ఏపీ సీఈఓ కార్యాలయంలో కరుణాకర్ రెడ్డిపై తెలుగుదేశం - బీజేపీ జనసేన కూటమి నేతలు ఫిర్యాదు చేశారు.

AP Politics: భూమన కరుణాకర్‌రెడ్డిని టీటీడీ చైర్మన్ పదవీ నుంచి తొలగించాలి: భానుప్రకాష్ రెడ్డి

అమరావతి: టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) తన కుమారుడి కోసం ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని.. వెంటనే ఆయనను ఆ పదవీ నుంచి తొలగించాలని బీజేపీ (BJP) నేత భానుప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) డిమాండ్ చేశారు. గురువారం నాడు ఏపీ సీఈఓ కార్యాలయంలో కరుణాకర్ రెడ్డిపై తెలుగుదేశం - బీజేపీ జనసేన కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి కుమారుడు అధికార వైసీపీ నుంచి తిరుపతి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు.


Lokesh: కోయంబత్తూరుకు బయలుదేరిన నారా లోకేష్.. విషయం ఇదే!

ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... గత ఏడాదిగా తిరుమల తిరుపతి దేవస్థానికి చెందిన 1500 కోట్ల రూపాయల నిధులను ఇంజినీరింగ్ సెక్షన్ పేరుతో దోచేశారని ఆరోపించారు. ఇలా పనుల పేరుతో దోచిన సొమ్ములో కమీషన్లు తీసుకొని వాటిని ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని శ్రీవారి భక్తులు ఆరోపిస్తున్నారని చెప్పారు.


Varla Ramaiah: ఆ ఇద్దరి చేతగానితనం వల్లే పోలీసులకు ఈ దుస్థితి

టీటీడీలో శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు 28 వేల కుటుంబాలున్నాయని.. ఒక్కో కుటుంబానికి మూడు, నాలుగు ఓట్లు వేసుకుంటే దాదాపు లక్ష మంది ఓటర్లపై చైర్మన్ ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడి కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని అన్నారు. ఆ హోదాలో ఉండి ఎన్నికల ప్రచారం చేయడం తగదన్నారు.


అందుకే ఆయనను టీటీడీ చైర్మన్ పదవీ నుంచి తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా పర్యటనలో ఉన్నందున ఆయన కార్యాలయంలోని కంప్లైంట్ సెల్లో ఫిర్యాదు అందజేసినట్లు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు.


ఇవి కూడా చదవండి

YS Sharmila: మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా?

Inter Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఇంటర్ రిజల్ట్స్.. పూర్తి వివరాలివే..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 11 , 2024 | 10:05 PM