Share News

Bhanuprakash: శ్రీవారి ఆభరణాలను తనిఖీ చేయాల్సిందే..

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:34 AM

Andhrapradesh: గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో ధార్మిక క్షేత్రాన్ని.. అధార్మిక క్షేత్రంగా మార్చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... టిక్కెట్లు, గదులు, ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి రాజ్యమేలిందన్నారు. శ్రీవారి ఆభరణాలు భద్రమేనానన్న అనుమానం భక్తుల్లో కలుగుతోందని అన్నారు.

Bhanuprakash: శ్రీవారి ఆభరణాలను తనిఖీ చేయాల్సిందే..
BJP Leader Bhanu prakash Reddy

తిరుమల, జూలై 5: గత ఐదేళ్ళ వైసీపీ (YSRCP) పాలనలో ధార్మిక క్షేత్రాన్ని.. అధార్మిక క్షేత్రంగా మార్చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి (BJP Leader Bhanu Prakash Reddy) విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... టిక్కెట్లు, గదులు, ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి రాజ్యమేలిందన్నారు. శ్రీవారి ఆభరణాలు భద్రమేనానన్న అనుమానం భక్తుల్లో కలుగుతోందని అన్నారు. హైకోర్టు (AP High Court) సిట్టింగ్ జడ్జి ద్వారా శ్రీవారి ఆభరణాలను తనిఖీ చెయ్యించి.. భక్తుల అనుమానాలను నివృత్తి చెయ్యాలని డిమాండ్ చేశారు.

Pawan Kalyan: పవన్‌ భూమ్‌


శ్రీవారి ఆభరణాలను తనిఖీ చెయ్యడంతో పాటు టీటీడీలో (TTD) జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు. టీటీడీలో అవినీతి రాజ్యమేలినా టీటీడీ విజిలేన్స్ నిద్రొడ్డుతోందని విమర్శించారు. టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎందుకు మౌనంగా ఉన్నారో భక్తులకు సమాధానం చెప్పాలన్నారు. టీటీడీలో అవినీతిపై రాష్ట్ర విజిలెన్స్ తనిఖీలు నిర్వహిస్తున్నా.. టీటీడీ అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Andhra Pradesh: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!

Telugu Desam: పని చేసినోళ్లకు ప్రాధాన్యమెలా..?

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 05 , 2024 | 11:51 AM