Share News

Musi: మూసీ కూల్చివేతలకు బ్రేక్.. ఎందుకంటే

ABN , Publish Date - Oct 03 , 2024 | 12:30 PM

Telangana: ఖాళీ చేసిన ఇళ్లను ఇప్పటి వరకు అధికారులు కూల్చివేశారు. అయితే కొంతమంది బాధితులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించినప్పటికీ ఖాళీ చేయని పరిస్థితి. హైదరాబాద్ శివారులో డబుల్‌ బెడ్‌రూంలు కేటాయించారని.. ఒక్కో ఇంట్లో 16 మంది ఉన్న వారికి డబుల్ బెడ్ రూంలు ఏం సరిపోతాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Musi: మూసీ కూల్చివేతలకు బ్రేక్.. ఎందుకంటే
Revenue officials stopped the demolitions in Moosi Areas

హైదరాబాద్, అక్టోబర్ 3: మూసీ (Musi) సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపుకు బ్రేక్ పడింది. శంకర్ నగర్, మూసానగర్‌లో స్థానికులు ఇళ్ళు ఖాళీ చేయకపోవడంతో అధికారులు కూల్చివేతలను నిలిపివేశారు. ఈ కూల్చివేతలకు రెవెన్యూ అధికారులు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. ఓల్డ్ మలక్‌పేట్, శంకర్‌నగర్‌లో 450 ఇళ్లను అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 140 ఇళ్లు కూల్చివేసి బాధితులను చంచల్‌గూడలో ఉన్న డబుల్ బెడ్ రూం (Double Bed Rooms) ఇళ్లకు తరలించారు.

Protest: సీఎం దృష్టి పడొద్దని.. దిష్టి తీసి వినూత్న నిరసన


ఖాళీ చేసిన ఇళ్లను ఇప్పటి వరకు అధికారులు కూల్చివేశారు. అయితే కొంతమంది బాధితులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించినప్పటికీ ఖాళీ చేయని పరిస్థితి. హైదరాబాద్ శివారులో డబుల్‌ బెడ్‌రూంలు కేటాయించారని.. ఒక్కో ఇంట్లో 16 మంది ఉన్న వారికి డబుల్ బెడ్ రూంలు ఏం సరిపోతాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంతా ఇళ్లు ఖాళీ చేయని నేపథ్యంలో అధికారులు కూల్చివేతలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే బాధితులకు డబుల్ బెడ్ రూమ్‌తో పాటు 25 వేల సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే.


కాగా.. ఆపరేషన్ మూసీలో భాగంగా రెండు రోజుల క్రితమే మూసీపరివాహక ప్రాంతాల్లో ఇళ్లను కూల్చివేసే పనులను ప్రారంభించారు రెవెన్యూ అధికారులు. RB- X అని రాసి, ఇళ్ళు ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు జరుగకుండా భారీ బందోబస్తు నడుమ ఇళ్లను కూల్చివేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించేందుకు, ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి, కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకు ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది.అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్‌టీఎల్‌ పరిధిని సర్వే చేశారు. అందులో దాదాపు 16 వేల నివాసాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు తేలింది.

Minister Konda Surekha: వెనక్కి తగ్గేది లేదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్


అందులో పేద, మధ్యతరగతి వారు నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీఓ కూడా జారీ చేసింది. అయితే డబుల్‌ బెడ్రూమ్‌లు ఎవరికి ఇవ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి.. గుర్తించి ఇళ్లపై RB-X (Riverbed Extreme) అని రాశారు. అయితే పలు ప్రాంతాల్లో మార్క్ సర్వే చేసిన అధికారులు స్థానికులు అడ్డుకున్నారు. అధికారులపై తిరగబడ్డారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. డబుల్ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ పలువురు స్థానికులు ఆందోళనకు దిగారు. మూసీ రివర్‌ బెడ్‌లో ఉన్న ఇళ్లు, వాటి యాజమానుల వివరాలు నమోదు చేసేందుకు వచ్చిన అధికారులను పలు ప్రాంతాల్లో నివాసితులు అడ్డుకున్నారు. చివరకు పోలీసు బందో బస్తు నడుమ మార్క సర్వేను అధికారులు కొనసాగించారు.


ఇవి కూడా చదవండి...

AV Ranganath: హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు సన్మానం..

Bathukamma: రెండో రోజు అటుకుల బతుకమ్మ.. విశిష్టత ఇదే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 03 , 2024 | 12:34 PM