Share News

MP Lavu Srikrishnadevarayalu: పల్నాడులో పరిస్థితి మరింత దారుణం..

ABN , Publish Date - Jul 25 , 2024 | 01:22 PM

ఏపీలో నెలకొన్న నీటి సమస్యలపై ఎంపీలావు శ్రీకృష్ణ దేవరాయలు లోక్‌సభలో మాట్లాడారు. ముఖ్యంగా ఏపీలోని పల్నాడులో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు.

MP Lavu Srikrishnadevarayalu: పల్నాడులో పరిస్థితి మరింత దారుణం..

ఢిల్లీ: ఏపీలో నెలకొన్న నీటి సమస్యలపై ఎంపీలావు శ్రీకృష్ణ దేవరాయలు (MP Lavu Srikrishnadevarayalu) లోక్‌సభ (Loksabha)లో మాట్లాడారు. ముఖ్యంగా ఏపీలోని పల్నాడు (Palnadu)లో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. భూగర్భ జలాలలన్నీ అడుగంటి పోయాయని.. 200 వరకు తవ్వితేనే... నీళ్లు వస్తాయని వివరించారు. కేంద్రం నిధులు కేటాయిస్తున్నా కూడా గత ప్రభుత్వం వాటిని ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. కనీసం నీళ్లు లభించే ప్రాంతాల నుంచి అయినా సరఫరా చేసే ఆలోచన ఏమీ చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల జిల్లాల్లో కూడా జలజీవన్ మిషన్ కింద కుళాయి నీటి సదుపాయం కల్పించినట్లు మంత్రి చెప్పారు. పల్నాడు జిల్లాలో పరిస్థితి మరో విధంగా ఉందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వెల్లడించారు.


పల్నాడులో ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టారు కానీ నీళ్లు మరిచారన్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఎంపీ వివరించారు. బోర్ వెల్ కనీసం 1200 వరకు తవ్వితేనే... నీళ్లు వస్తాయని వివరించారు. గత ఐదేళ్లలో రూ. 350 కోట్లు కేటాయించినా... నిధులు ఖర్చు చేయలేదని నరసరావుపేట ఎంపీ తెలిపారు. నీళ్లు లభించే ప్రాంతం నుంచి సరఫరా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి... తగిన విధంగా సహాయ పడాలని కేంద్రాన్ని శ్రీకృష్ణ దేవరాయలు కోరారు. శ్రీకృష్ణదేవరాయలు లేవనెత్తిన ప్రశ్న చాలా సీరియస్ అంశం అని, దీనిపై అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయన్న కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అన్నారు. నీటి లభ్యత, సరఫరా వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి చర్యలు తీసుకుంటుందన్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు లేవనెత్తిన అంశాన్ని ప్రత్యేకంగా చూడాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో నీటి లభ్యత ఎంత ఉంది, ఎక్కడి నుంచి తీసుకోవాలో నిర్ణయం చేయొచ్చని మంత్రి పేర్కొన్నారు.


గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో జలజీవన్ మిషన్ (Jal Jeevan Mission) కింద 40 శాతం వరకూ గృహాలకు కుళాయి నీటి వసతి లభించిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ప్రస్తుతం మొత్తంగా... 72, 73 శాతం వరకూ కుళాయి సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో కేంద్రం నుంచి ఇచ్చే నిధులు, సాంకేతిక సహకారంతో 100 శాతం పూర్తి అవుతుందని తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు అడిగిన ప్రశ్నకు సభలో జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమాధానం చెప్పారు

ఈ వార్తలు కూడా చదవండి..

గంజాయి మత్తులో అనేక దారుణాలు: హోంమంత్రి అనిత

పవన్ తాటతీస్తున్నారు: పృథ్వీరాజ్

జగన్ బూమ్ బూమ్ రహస్యం...

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 25 , 2024 | 04:08 PM