Telangana Budget 2024: తెలంగాణ బడ్జెట్.. కేటాయింపుల వివరాలివే..
ABN , Publish Date - Jul 25 , 2024 | 01:02 PM
Telangana Budget 2024-25: తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ రూ. 2,91,191 కోట్లు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రాష్ట్ర తలసరి ఆదాయం,
Telangana Budget 2024-25: తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ రూ. 2,91,191 కోట్లు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రాష్ట్ర తలసరి ఆదాయం, అప్పులు, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం వంటి వివరాలను వెల్లడించారు. అలాగే, బడ్జెట్‌లో ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించారు.. ఈ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారనే వివరాలను బడ్జెట్ ప్రసంగంలో వివరించారు ఆర్థిక మంత్రి భట్టి.
తెలంగాణ బడ్జెట్ 2024-25 పూర్తి వివరాలివే..
తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ : రూ.2,91,191 కోట్లు.
రెవెన్యూ వ్యయం - రూ.2,20,945 కోట్లు
మూలధన వ్యయం - రూ.33,487 కోట్లు
తెలంగాణ తలసరి ఆదాయం - రూ.3,47,299
తెలంగాణ ఏర్పాటు నాటికి అప్పు - రూ. 75,577 కోట్లు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి అప్పు - రూ. 6.71 లక్షల కోట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ. 42 వేల కోట్ల బకాయిలు చెల్లింపు.
వివిధ రంగాలకు కేటాయింపులు కోట్లలో..
వ్యవసాయం, అనుబంధ రంగాలకు- రూ. 72,659
హార్టికల్చర్ - రూ. 737
పశుసంవర్ధక శాఖ - రూ. 19,080
మహాలక్ష్మి ఉచిర రవాణా - రూ. 723
గృహజ్యోతి - రూ. 2,418
ప్రజాపంపిణీ వ్యవస్థ - రూ. 3,836
పంచాయతీ రాజ్ - రూ. 29,816
మహిళా శక్తి క్యాంటిన్ - రూ. 50
హైదరాబాద్ అభివృద్ధి- రూ. 10,000
జీహెచ్ఎంసీ - రూ. 3,000
హెచ్‌ఎండీఏ - రూ. 500
మెట్రో వాటర్ - రూ. 3,385
హైడ్రా - రూ. 200
ఏయిర్పోట్‌కు మెట్రో - రూ. 100
ఓఆర్ఆర్ - రూ. 200
హైదరాబాద్ మెట్రో - రూ. 500
ఓల్డ్ సిటీ మెట్రో - రూ. 500
మూసీ అభివృద్ధి - రూ. 1,500
రీజినల్ రింగ్ రోడ్డు - రూ. 1,500
స్ర్తీ, శిశు సంక్షేమం - రూ. 2,736
ఎస్సీ, ఎస్టీ సంక్షేమం - రూ. 17,000
మైనారిటీ సంక్షేమం - రూ. 3,000
బీసీ సంక్షేమం - రూ. 9,200
వైద్య ఆరోగ్యం - రూ. 11,468
విద్యుత్ - రూ. 16,410
అడవులు, పర్యావరణం - రూ. 1,064
ఐటి - రూ. 774
నీటి పారుదల - రూ. 22,301
విద్య - రూ. 21,292
హోంశాఖ - రూ. 9,564
ఆర్ అండ్ బి - రూ. 5,790
Also Read: