Share News

TTD: అన్నప్రసాదాల తయారీపై టీటీడీ కీలక నిర్ణయం

ABN , Publish Date - Jul 02 , 2024 | 04:40 PM

Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సేంద్రీయ బియ్యం వాడకాన్ని నిలిపినేయాలని టీటీడీ నిర్ణయించింది. అన్నప్రసాదాల తయారీకి గతంలో వినియోగించే బియ్యానే వాడాలని నిర్ణయం తీసుకుంది. గత కొద్దీ సంవత్సరాలుగా అన్నప్రసాదాల్లో నాణ్యత లోపించిందంటూ..

TTD: అన్నప్రసాదాల తయారీపై టీటీడీ కీలక నిర్ణయం
TTD key decision

తిరుమల, జూలై 2: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి (Lord Venkateshwara) నివేదించే అన్నప్రసాదాలపై టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. సేంద్రీయ బియ్యం వాడకాన్ని నిలిపినేయాలని టీటీడీ నిర్ణయించింది. అన్నప్రసాదాల తయారీకి గతంలో వినియోగించే బియ్యానే వాడాలని నిర్ణయం తీసుకుంది. గత కొద్దీ సంవత్సరాలుగా అన్నప్రసాదాల్లో నాణ్యత లోపించిందంటూ పెద్ద ఎత్తున్న భక్తుల నుంచి టీటీడీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగడంతో యువతి మిస్సింగ్ కేసులో వీడిన మిస్టరీ


భక్తుల ఫిర్యాదుల నేపథ్యంలో అన్నప్రసాదాల తయారీకి సాధారణ బియ్యానే వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. అలాగే అన్న ప్రసాదాల దిట్టంను కూడా పెంచాలని నిర్ణయించింది. కరోనా సమయంలో అన్న ప్రసాదాల దిట్టంను టీటీడీ తగించిన విషయం తెలిసిందే. సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికి.. అప్పటి నుంచి ప్రసాదాల దిట్టాన్ని టీటీడీ పెంచలేదు. ఈ క్రమంలో సాధారణ బియ్యం వాడకం ప్రారంభించే నాటి నుంచి అన్నప్రసాదాల దిట్టాని పెంచాలని టీటీడీ నిర్ణయించింది.


ఇవి కూడా చదవండి....

AP Politics: సీఎం రేవంత్‌తో వైఎస్ షర్మిల భేటీ.. స్కెచ్‌లో భాగమేనా?

Doctor: ఐదేళ్లుగా సహజీవనం.. పెళ్లికి నో.. ఏం జరిగిందంటే..!!

Read Latest AP News AND Telugu News

Updated Date - Jul 02 , 2024 | 04:45 PM