Share News

Viral Video: మొసలి, కొండచిలువ మధ్య భయంకర పోరాటం.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

ABN , Publish Date - Jul 02 , 2024 | 04:32 PM

కొండచిలువలు, మొసళ్లు రెండూ చాలా శక్తివంతమైనవనే విషయం అందరికీ తెలిసిందే. నీటిలో ఉన్న మొసలికి ఒక్కసారి దొరికితే.. ఇక తప్పించుకనే అవకాశమే ఉండదు. ఎంత పెద్ద జంతువైనా దానికి ఆహారమైపోవాల్సిందే. అలాగే..

Viral Video: మొసలి, కొండచిలువ మధ్య భయంకర పోరాటం.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

కొండచిలువలు, మొసళ్లు రెండూ చాలా శక్తివంతమైనవనే విషయం అందరికీ తెలిసిందే. నీటిలో ఉన్న మొసలికి ఒక్కసారి దొరికితే.. ఇక తప్పించుకనే అవకాశమే ఉండదు. ఎంత పెద్ద జంతువైనా దానికి ఆహారమైపోవాల్సిందే. అలాగే కొండచిలువ వేట కూడా అంతే భయంకరంగా ఉంటుంది. దానికి చిక్కిన వేటను ఒక్కసారిగా చుట్టేసి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసేస్తుంది. అందుకే దీని జోలికి వెళ్లేందుకు ఏ జంతువూ సాహసించదు. అయితే ఈ రెండింటి మధ్య అప్పుడప్పుడూ పోరాటం జరుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మొసలి, కొండచిలువ మధ్య భయంకర పోరాటం జరిగింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మొసలి, కొండచిలువలు సడన్‌‌గా తారసపడతాయి. అప్పటికే ఆకలితో ఉన్న మొసలి.. కొండచిలువను ఎటాక్ చేస్తుంది. అయితే తానేమీ తక్కు కాదన్నట్లు కొండచిలువ కూడా మొసలితో పోరాటానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో రెండింటి (fight between crocodile and python) మధ్య భయంకర పోరు జరుగుతుంది. కొండచిలువను కొరికి చంపేయాలని మొసలి ప్రయత్నిస్తుంది. దీంతో చివరకు కొండచిలువ.. మొసలిని మొత్తం గట్టిగా చుట్టేసి ఊపిరాడకుండా చేస్తుంది.

Viral video: నాగుపాము సమీపానికి వెళ్లిన తాబేలు.. సడన్‌గా కోబ్రా కాటేయడంతో.. చివరకు..


దెబ్బకు మొసలికి చుక్కలు కనిపిస్తాయి. ‘‘వామ్మో.. ఈ కొండచిలువను చంపడం మామూలు విషయం కాదురా బాబోయ్’’.. అనుకున్నట్లుగా.. దాన్ని వెంటనే వదిలేస్తుంది. దీంతో కొంద చిలువు.. ‘‘ఇంకోసారి నాతో పెట్టుంటే.. ప్రాణాలు తీసేస్తా’’.. అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! కొండచిలువ పవర్.. మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బట్టలు ఉతుకుతున్న ప్పుడు కూడా అదే పనా.. వామ్మో..! ఈమె టెక్నిక్ మామూలుగా లేదుగా..

Updated Date - Jul 02 , 2024 | 05:12 PM