TTD EO: తిరుమలలో ఏర్పాట్లపై మంత్రికి భక్తుడి ఫిర్యాదులో ట్విస్ట్.. అసలేం జరిగిందో చెప్పిన ఈవో
ABN , Publish Date - Sep 17 , 2024 | 01:37 PM
Andhrapradesh: తిరుమలలో అన్నపానీయాలు అందలేదంటూ నిన్న (సోమవారం) ఓ భక్తుడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఫిర్యాదు చేసిన వ్యవహారంలో అసలు నిజం బయటపడింది. దీనిపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు.
తిరుమల, సెప్టెంబర్ 17: తిరుమలలో (Tirumala) అన్నపానీయాలు అందలేదంటూ నిన్న (సోమవారం) ఓ భక్తుడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి (Minister Anam Ram Narayanareddy) ఫిర్యాదు చేయడంపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఈవో బయటపెట్టారు. మంగళవారం మీడియాతో ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. భక్తుడి ఫిర్యాదు అంశాన్ని సీరియస్‌గా పరిగణించామని తెలిపారు. భక్తుడు క్యూ లైన్లో ప్రవేశించిన సమయంతో పాటు క్యూ లైన్లో వేచి ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించామని తెలిపారు.
Telangana DGP: ఏ సమయానికి నిమజ్జనాలు పూర్తవుతాయో చెప్పిన డీజీపీ
సిసి పుటేజ్ ఆధారంగా భక్తుడు రాత్రి 10:30 గంటలకు క్యూ లైనులో ప్రవేశించి.. ఉదయం 10:45 గంటలకు వెలుపలికి వచ్చేశాడని తెలిపారు. క్యూ లైనులో ఉన్న సమయంలో భక్తుడు రెండు సార్లు అన్నప్రసాదం స్వీకరించారన్నారు. నిన్న ఉదయం కూడా భక్తులు పాలు స్వీకరించారని వెల్లడించారు. భక్తుడిని పిలిపించి విచారణ జరిపామని... క్యూ లైన్లో అధిక సమయం వేచి ఉండలేక ప్రస్టేషన్ కారణంగా మంత్రికి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు నిరంతరాయంగా అన్నపానీయాలు అందజేస్తున్నారన్నారు. నిజంగా సమస్యలు ఉంటే టీటీడీ దృష్టికి తీసుకువస్తే.. తప్పకూండా వాటిని సరిదిద్దుకుంటామని వెల్లడించారు. టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకుల మనోధైర్యం దెబ్బతినేలా భక్తులు ఆరోపణలు చెయ్యవద్దని టీటీడీ ఈవో శ్యామలరావు విజ్ఞప్తి చేశారు.
అసలేం జరిగిందంటే..
తిరుమలలో ఏర్పాట్లపై ఓ భక్తుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏకంగా ఏపీ మంత్రికే తిరుమలలో ఏర్పాట్లపై ఫిర్యాదు చేశాడు. తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదంటూ శ్రీవారి ఆలయం వద్దే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఆదివారం నుంచి క్యూ లైనల్లో వేచి వున్నా స్వామి వారి దర్శన భాగ్యం దక్కలేదన్నారు. అంతేకాకుండా క్యూలైనల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయలేదని తెలిపారు. చిన్న బిడ్డలతో క్యూలైన్లలో వేచి ఉండలేక బయటకు వచ్చేసామంటూ మంత్రికి సదరు భక్తుడు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి ఆనం.. భక్తుడ్ని సముదాయించే ప్రయత్నం చేశారు. అధికారులకు చెప్పి దర్శనం కల్పిస్తామని భక్తుడికి మంత్రి ఆనం హామీ ఇచ్చారు.
Rammohannaidu: అది చంద్రబాబు పనితీరు వల్లే సాధ్యం
మంత్రి సంధ్యారాణి అనుచరుల వీడియోపై..
అలాగే.. సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్న మంత్రి సంధ్యరాణి అనుచరులకు సంభందించిన వీడియోపై కూడా ఈవో శ్యామలరావు స్పందించారు. ప్రాధమిక విచారణలో వీడియోలో ఉన్న దృశ్యాలు తిరుమలలో జరగలేదని గుర్తించామన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపాలని విజిలేన్స్ అధికారులను ఆదేశించామన్నారు. ఒక వేళ తిరుమలలో జరిగినట్లు నిర్ధారణ అయితే తగిన చర్యలు తీసుకుంటామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
Anitha: వాళ్లు ఉగ్రవాదుల కన్నా చాలా డేంజర్.. హోంమంత్రి సంచలన కామెంట్స్
Rammohannaidu: అది చంద్రబాబు పనితీరు వల్లే సాధ్యం
Read LatestAP NewsAndTelugu News