Devineni Uma: ఆ నిధులను పక్కదారి పట్టించిన జగన్‌రెడ్డి
ABN , Publish Date - Mar 18 , 2024 | 08:15 PM
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కృషితో జాతీయ ప్రాజెక్టుగా పోలవరానికి గుర్తింపు తెస్తే.. సీఎం జగన్ రెడ్డి (CM Jagan) విధ్వంసంతో జాతికి ద్రోహం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజావేదిక విధ్వంసతో ప్రారంభమైన జగన్ రెడ్డి పాలన డయఫ్రం వాల్ విధ్వంసంతో ముగిసిందని మండిపడ్డారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కృషితో జాతీయ ప్రాజెక్టుగా పోలవరానికి గుర్తింపు తెస్తే.. సీఎం జగన్ రెడ్డి (CM Jagan) విధ్వంసంతో జాతికి ద్రోహం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజావేదిక విధ్వంసతో ప్రారంభమైన జగన్ రెడ్డి పాలన డయఫ్రం వాల్ విధ్వంసంతో ముగిసిందని మండిపడ్డారు. చంద్రబాబు(Chandrababu) పాలనలో రూ.11,923 కోట్లు ఖర్చు పెట్టి 72 శాతం పనులు పూర్తి చేస్తే.. జగన్ 5 ఏళ్లల్లో రూ.5,825 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని చెప్పారు.
టీడీపీ (TDP) హయాంలో రాయలసీమను కాపాడాలని హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ, ముచ్చుమర్రి, పట్టిసీమ వంటి ప్రాజెక్టుల పనులు పరుగులెత్తించామని తెలిపారు.రాయలసీమకు వెళ్లాల్సిన నీటిని పక్క రాష్ట్రానికి ఇచ్చిన తెలివి తక్కువ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 62 ప్రాజెక్టులను పరిగెత్తించి 23 ప్రాజెక్టులు పూర్తి చేశారన్నారు. ప్రాజెక్టుల కోసం రూ.68, 293 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. జగన్ రెడ్డి రూ.35,268 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టుకు నీళ్లివ్వలేదని మండిపడ్డారు. టీడీపీ నీటి పారుదల రంగంలో చేసిన పనులకు ఎన్నో అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ జగన్ రెడ్డి నీటి సంఘాలు, నీరు చెట్టు, నీరు ప్రగతిని నాశనం చేశారన్నారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ.2,500 కోట్ల నిధులు నిర్వాసితులకు ఇవ్వకుండా దారి మళ్లించారని దేవినేని ఉమ మండిపడ్డారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి