Devineni Uma: ఏపీ రాజధాని ఏదో జగన్ చెప్పగలరా..?
ABN , Publish Date - Mar 30 , 2024 | 04:26 PM
సీఎం జగన్‌రెడ్డి (CM Jagan Reddy) చెప్పిన అబద్దాలే మళ్లీ మళ్లీ చెప్పి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni Uma) అన్నారు. తాను ఫ్టస్ట్ క్లాస్ స్టూడెంట్ అని శాసన సభలో జగన్ చెప్పారని... అబద్దాలు చెప్పడంలో జగన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంటేనని ఎద్దేవా చేశారు.
అమరావతి: సీఎం జగన్‌రెడ్డి (CM Jagan Reddy) చెప్పిన అబద్దాలే మళ్లీ మళ్లీ చెప్పి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ (Telugudesam Party) సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni Uma) అన్నారు. తాను ఫ్టస్ట్ క్లాస్ స్టూడెంట్ అని శాసన సభలో జగన్ చెప్పారని... అబద్దాలు చెప్పడంలో జగన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంటేనని ఎద్దేవా చేశారు. అబద్దాల్లో జగన్ పీహెచ్డీ తీసుకున్నారని సెటైర్లు గుప్పించారు. జగన్ చేపడుతున్న బస్సు యాత్ర తుస్ యాత్ర అయిందని దెప్పిపొడిచారు. వైసీపీ ప్రభుత్వం చేస్తానన్న మద్యపాన నిషేధం హామీ ఏమైంది..? అని ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్‌కు ఇసుక, మద్యం మాఫియా సొమ్మును తరలించారని దేవినేని ఉమ ఆరోపించారు.
AP Politics: వైసీపీని ప్యాక్ చేసేస్తోన్న ఐ ప్యాక్..!! ఏం జరిగిందంటే..?
శాండ్, ల్యాండ్, మైన్, వైన్ మాఫియాలతో డబ్బులు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఏడు లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లారని చెప్పారు. అమ్మఒడిలో ఏడు లక్షల మందికి కోత విధించారని అన్నారు. కమీషన్ల కోసమే నాడు-నేడు చేపట్టారని అన్నారు. జగన్ ఇద్దరు చెల్లెళ్లు రక్షా బంధన్ కట్టేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కేసుపై ఇప్పుడు సీబీఐ విచారణ వద్దంటున్నారని చెప్పారు.
బాబాయ్ హంతకులకే మళ్లీ టిక్కెట్ ఎలా ఇస్తారని చెల్లెళ్లు ప్రశ్నిస్తున్నారన్నారు. చాలా చోట్ల ప్యాలెస్సులు కట్టుకున్న జగన్ పేదవాడా..? అని నిలదీశారు. దేశంలో అత్యధిక ఇన్‌కంట్యాక్స్ కట్టేది సీఎం జగనేనని అన్నారు. జగన్ పేదవాడు.. మేం పెత్తందారులమా..? అని నిలదీశారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లు కనీసం ఓ సభ పెట్టుకునేందుకు కూడా అనుమతివ్వని జగన్ పేదల పక్షపాతా..? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను సీఎం జగన్ గాలికొదిలేశారని మండిపడ్డారు. కుప్పంలో నీళ్లిచ్చినట్లు డ్రామాలు ఆడి.. వెంటనే గేట్లు తీసుకెళ్లిన జగన్ రైతు పక్షపాతి ఎలా అవుతారని దేవినేని ఉమ ప్రశ్నించారు.
రాయలసీమలో ప్రాజెక్టులు, రైతులను జగన్ నాశనం చేశారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇస్తానన్న పునరావాసం ఏమైంది..? అని ప్రశ్నించారు. పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాలల్లో ఓట్లు అడిగే అర్హత జగనుకుందా..? అని నిలదీశారు. ఏపీ రాజధాని పేరేంటో జగన్ చెప్పగలరా..? అని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దును వైసీపీ గాలికి వదిలేసిందని మండిపడ్డారు. అమ్మఒడి ఎంతమందికైనా ఇస్తామని చెప్పి జగన్ మాట తప్పారని అన్నారు. ఆర్టీసీని కూడా నష్టపరిచేలా చేశారని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల గొంతును జగన్ కోసేశారన్నారు. రైతులకిచ్చే ధాన్యం డబ్బులను జగన్ దోచుకున్నారని ధ్వజమెత్తారు. కొడాలి నాని ధాన్యం డబ్బుల్లో జగనుకు కమీషన్ ఇచ్చారని విమర్శించారు. జగన్ అబద్దాల కోరని... వివేకా హత్య కేసులో ప్రధాన ముద్దాయి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్నారని విరుచుకుపడ్డారు. కదిరి గొడ్డలి ఎక్కడుందో చెప్పాలని దేవినేని ఉమ ప్రశ్నించారు.
AP Politics: చంద్రబాబు నుంచి బండారుకు పిలుపు.. వైసీపీ బంపరాఫర్లు!
జగన్ మాటల్లో నైరాశ్యం..
జగన్ మాటల్లో నైరాశ్యం కన్పిస్తోందని.. ఆయన మాటల్లో ఓటమి కనబడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమ చెప్పారు. అమరావతి రైతుల కన్నీళ్ల ఉసురు ఆయనకు తగిలిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తామన్న సాయం ఏమైంది..? అని ప్రశ్నించారు. పింక్ డైమండ్ పోయిందని డబ్బా కబుర్లు చెప్పారని ఎద్దేవా చేశారు. పింక్ డైమండ్ తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చిందా..? అని నిలదీశారు. వెన్నుపోటుకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని సొంత చెల్లెళ్లే అంటున్నారని చెప్పారు. జూన్ 4 తర్వాత జగన్ ఇంగ్లండ్ వెళ్లడం ఖాయమన్నారు. ఓటమి తర్వాత పారిపోవడానికి వైసీపీ అభ్యర్థులు పాస్ పోర్టులు తీసుకుని సిద్ధంగా ఉంచుకున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ హేట్స్ జగన్ అనేది ప్రజల నినాదంగా మారిందన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావడం ఖాయమని దేవినేని ఉమ ధీమా వ్యక్తం చేశారు.
KA Paul: నా సత్తా ఏంటో వైసీపీ నాయకులకి తెలియడం లేదు.. 7 రోజులు టైం ఇస్తున్నా..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి