AP Elections 2024: ఏపీలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా? కీలక వివరాలు చెప్పిన ఈసీ..
ABN , Publish Date - May 03 , 2024 | 03:59 PM
4వ విడత లోక్‌సభ ఎన్నికలతో పాటే(Lok Sabha Polls 2024).. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు(Voters) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏపీలో ఓటర్ల సంఖ్యకు సంబంధించి ఈసీ(Election Commission) ఫైనల్ లిస్ట్‌ని రిలీజ్ చేసింది.
అమరావతి, మే 03: 4వ విడత లోక్‌సభ ఎన్నికలతో పాటే(Lok Sabha Polls 2024).. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు(Voters) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏపీలో ఓటర్ల సంఖ్యకు సంబంధించి ఈసీ(Election Commission) ఫైనల్ లిస్ట్‌ని రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మే 13న జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2.2 కోట్ల పురుష ఓటర్లు, 2.10 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. మిగతా వాటిలో సర్వీస్ ఓటర్లు, థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో కొత్త ఓటర్లు 5.94 లక్షలు నమోదైనట్లు ఎన్నికల సీఈవో తెలిపారు.
ఎన్నికల బరిలో నిలిచింది వీరే..
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 స్థానాలకు గానూ 454 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే, 175 అసెంబ్లీ స్థానాలకు 2,300 మంది పోటీ చేస్తున్నారు. ఇక స్టేట్ అబ్జర్వర్స్ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియను 100 శాతం వెబ్‌క్యాస్టింగ్ నిర్వహించడం జరుగుతుందని, ఆయా పోలింగ్ కేంద్రాల్లో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు సీఈవో తెలిపారు. 29,897 పోలింగ్ స్టేషన్లలో నామమాత్రపు వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఓటర్లకు సదుపాయాలు..
ఎండలు తీవ్రస్థాయిలో ఉండటంతో.. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్లకు కీలక సూచనలు చేసింది. ఎండ తీవ్రత కారణంగా ఓటర్లు ఇబ్బంది పడకుండా.. అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఈసీ సూచించింది. పోలింగ్ కేంద్రాల్లో డ్రింకింగ్ వాటర్, ఫ్యాన్స్, కూలర్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వంటి వాటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అలాగే, 85 ఏళ్లకు పైబడిన వారికి, అంగవైకల్యం కలిగిన వారికి హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించింది ఎన్నికల సంఘం.