AP Politics: మంత్రి అంబటికి సొంత అల్లుడు ఝలక్.. సంచలన వీడియో విడుదల..!
ABN , Publish Date - May 05 , 2024 | 03:26 PM
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది అధికార వైసీపీ(YCP) నేతలు రోజుకొకరుగా చిక్కుల్లో పడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతతో పాటు.. సొంత ఇంట్లోంచే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పిఠాపురంలో(Pithapuram) కాపు నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) సొంత కూతురే ఆయనపై తీవ్ర విమర్శలు చేయగా.. ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) వంతు వచ్చింది.
గుంటూరు, మే 05: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది అధికార వైసీపీ(YCP) నేతలు రోజుకొకరుగా చిక్కుల్లో పడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతతో పాటు.. సొంత ఇంట్లోంచే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పిఠాపురంలో(Pithapuram) కాపు నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) సొంత కూతురే ఆయనపై తీవ్ర విమర్శలు చేయగా.. ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) వంతు వచ్చింది. అంబటి రాంబాబు ఇంటిపోరుతో సతమతం అవుతున్నారు. తాజాగా అంబటిపై ఆయన సొంత అల్లుడే తీవ్ర విమర్శలు గుప్పించారు. అత్యంత పనికిరాని వ్యక్తి అని, అంబటికి ఎవరూ ఓటు వేయొద్దని పిలుపునిచ్చాడు ఆయన అల్లుడు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశాడు.
మంత్రి అంబటి రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఈ వీడియోలో మాట్లాడిన డాక్టర్ గౌతమ్.. ‘నేను మంత్రి అంబటి రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్. ఆయన అల్లుడు అవడం నా దురదృష్టం. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు వేరుకునే రకాన్ని ఇప్పటి వరకు నేను చూడలేదు. రోజూ పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని మరోసారి నా లైఫ్‌లో పరిచయం చేయకు స్వామి అని వేడుకుంటున్నాను. అంతటి భయంకరమైన వ్యక్తి అంబటి. ఒక ప్రజా ప్రతినిధిగా పోటీ చేస్తున్న వ్యక్తికి మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలి. కానీ వీటిల్లో ఏవీ లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటు వేసే ముందు ప్రజలు ఒకసారి ఆలోచించాలి.
మానవతా విలువలు, కనీస బాధ్యతలు అంబటికి లేవు. ఇలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దు. ఇలాంటి వాళ్లకు ఓటు వేస్తే.. అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న మోసగాళ్లకు ఓటు వేస్తున్నట్లే అవుతుంది. ఎంత లేకిపని అయినా చేసి సమాజంలో చాలా హుందాగా బతుకొచ్చు అనుకునే వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది. ఎలాంటి దరిద్రమైన పనులైనా చేసేస్తూ.. సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించొచ్చు అనుకునే వాళ్లకు ఓటు వేసినట్లే అవుతుంది. ఇలాంటి వాళ్లకు ఓటు వేసి ప్రోత్సహిస్తే.. రేపటి సమాజం కూడా అలాగే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి.. సరైన నిర్ణయంతో, సరైన బాధ్యతతో ఓటు వేసి బాధ్యతగల వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుతున్నాను.’ అంటూ డాక్టర్ గౌతమ్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.