Share News

AP Elections: వంగా గీత కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఓటర్లు... విషయం ఇదే!

ABN , Publish Date - May 12 , 2024 | 01:06 PM

Andhrapradesh: ఎన్నికలకు మరికొన్ని గంటలే ఉండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ వైసీపీ తీవ్రస్థాయిలో యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో డబ్బులు, నగదును రహస్యంగా పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే డబ్బుల విషయంలో పలు ప్రాంతాల్లో ఓటర్లు ఆందోళనకు దిగుతున్నారు. కొంతమందికి ఇచ్చి తమకు ఇవ్వలేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

AP Elections: వంగా గీత కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఓటర్లు... విషయం ఇదే!
Voters surrounded the office of YCP candidate Vanga Geetha

కాకినాడ, మే 12: ఎన్నికలకు (AP Elections) మరికొన్ని గంటలే ఉండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ వైసీపీ (YSRCP) తీవ్రస్థాయిలో యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో డబ్బులు, నగదును రహస్యంగా పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే డబ్బుల విషయంలో పలు ప్రాంతాల్లో ఓటర్లు ఆందోళనకు దిగుతున్నారు. కొంతమందికి ఇచ్చి తమకు ఇవ్వలేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత (YCP candidate Vanga Geetha) కార్యాలయాన్ని ఓటర్లు చుట్టుముట్టారు.

AP Elections: ఓటు వేసే ప్రతీ ఒక్కరూ ఆలోచించేలా మహిళ నిర్ణయం.. మీరూ చూడండి!


వార్డుల్లో కొంతమందికి డబ్బులు ఇచ్చి తమకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చే వరకు కదిలేది లేదని స్థానికులు ఆందోళనకు దిగారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఓటర్లను చెదరగొట్టేశారు. మరోపక్క ఉప్పాడ కొత్తపల్లిలో వైసీపీ ఇచ్చే డబ్బులు అందలేదని స్థానికులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడికక్కడ వైసీపీ డబ్బుల కోసం ఓటర్లు ఆందోళన చేస్తున్న పరిస్థితి.

Loksabha Elections: సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభం


మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. అక్కడి ఓటర్లకు స్థానిక వైసీపీ నేతలు చీరలను పంపిణీ చేశారు. అయితే వైసీపీ నేతలు పంపిణీ చేసిన చీరలు తమకు వద్దంటూ మహిళలు నిరసనకు దిగారు. ఆలమూరు మండలం పినిపెళ్ళ మూలస్థానం, మడికి గ్రామాల్లో వైసీపీ నేతలు ఇళ్ళ వద్ద మహిళలు చీరలను పడవేశారు. వైసీపీ నేతల తీరుపై అతివలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకెళ్లొచ్చా.. మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..?

Rain: మండుటెండలో కుండపోత...

Read Latest AP News And Telugu News

Updated Date - May 12 , 2024 | 02:10 PM