Share News

Sujana Chowdary: వారి సాన్నిహిత్యంలో ఆదర్శ నియోజకవర్గంగా మార్చి చూపుతా...

ABN , Publish Date - May 07 , 2024 | 11:11 AM

Andhrapradesh: నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం అపార్ట్‌మెంట్ వాసులతో సుజనా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణ, అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. అలాగే కొండ ప్రాంత ప్రజలతో కలిసి పోయి వారి ఇబ్బందులు స్వయంగా తెలుసుకుంటున్నారు.

Sujana Chowdary: వారి సాన్నిహిత్యంలో ఆదర్శ నియోజకవర్గంగా మార్చి చూపుతా...
BJP candidate Sujana Chaudhary Election Campaign

విజయవాడ, మే 7: నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి (BJP candidate Sujana Chaudhary Election Campaign) విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం అపార్ట్‌మెంట్ వాసులతో సుజనా (BJP Candidate) ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణ, అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. అలాగే కొండ ప్రాంత ప్రజలతో కలిసి పోయి వారి ఇబ్బందులు స్వయంగా తెలుసుకుంటున్నారు. విద్యుత్, డ్రైనేజి, తాగునీటి సమస్యలను సుజనాకు ప్రజలు వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పరిష్కారం చూపిస్తానని సుజనా చౌదరి ప్రజలకు హామీ ఇచ్చారు.

Konda Visveshwar Reddy: ఆటోడ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్‌...


ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో ప్రజల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఏ ప్రాంతానికి వెళ్లినా సమస్యలు, ఇబ్బందులు కనిపిస్తున్నాయన్నారు. అందుకే ప్రతి డివిజన్‌లో ఒక‌ కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. డివిజన్‌ల వారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. తాగునీరు, డ్రైనేజీ, కరెంటు సమస్యలను‌ పాలకులు అస్సలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Elections; జనసేన కోసం తరలివస్తున్న ఎన్‌ఆర్‌ఐలు


ఓటు వేసే ముందు అభ్యర్థి సమర్ధత, సామర్ధ్యం చూడాలన్నారు. ఏ పార్టీ ద్వారా సంక్షేమం, అభివృద్ధి జరుగుతాయో ఆలోచన‌ చేయాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశామని.. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కార్యాచరణ చేపడతామని తెలిపారు. ‘‘నాకున్న అనుభవం, మోదీ, చంద్రబాబుతో సాన్నిహిత్యంతో ఆదర్శ నియోజకవర్గంగా మార్చి చూపుతా’’ అని సుజనా చౌదరి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Nellore City: నెల్లూరు సిటీలో ఎవరు గెలవబోతున్నారు..?

Union Minister: ఎన్డీఏ కూటమికి 400కు పైగా స్థానాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 11:18 AM