Share News

AP Elections: సుజనాతో కలిసి ఇంటింటి ప్రచారంలో‌ పాల్గొన్న వంగవీటి

ABN , Publish Date - May 01 , 2024 | 11:21 AM

Andhrapradesh: పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్‌లో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సుజనాతో కలిసి వంగవీటి రాధాకృష్ణ ఇంటింటి ప్రచారంలో‌ పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో సుజనా చౌదరికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. కొన్ని ప్రధాన సమస్యలను సుజనాకు సీనియర్ సిటిజన్స్ వివరించారు.

AP Elections: సుజనాతో కలిసి ఇంటింటి ప్రచారంలో‌ పాల్గొన్న వంగవీటి
Sujana Chowdary Election Campaign

విజయవాడ, మే 1: పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్‌లో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి (BJP Candidate Sujana Chowdary) ఎన్నికల ప్రచారం (Election Campaign) నిర్వహిస్తున్నారు. సుజనాతో కలిసి వంగవీటి రాధాకృష్ణ ఇంటింటి ప్రచారంలో‌ పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో సుజనా చౌదరికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. కొన్ని ప్రధాన సమస్యలను సుజనాకు సీనియర్ సిటిజన్స్ వివరించారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి ప్రణాళికను త్వరలోనే ప్రకటించి అమలు చేస్తామని బీజేపీ అభ్యర్థి హామీ ఇచ్చారు.

BRS: బీఆర్‌ఎస్‏కు గుర్తుల గుబులు..! రోడ్‌ రోలర్‌, చపాతి మేకర్‌ ఎఫెక్ట్‌ భయం


కూటిమి మేనిఫెస్టోపై వివరణ..

ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. వైసీపీ (YSRCP) అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారనేది వాస్తవమన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి పార్టీల కార్యాచరణ ఉంటుందన్నారు. గత పాలకులు ఈ నియోజకవర్గం అభివృద్ధిని‌ పట్టించుకోలేదన్నారు. కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించలేదని విమర్శించారు. ఏ ప్రాంతానికి వెళ్లినా సమస్యలు, ప్రజలు ఇబ్బందులు కనిపిస్తున్నాయన్నారు. డివిజన్‌ల‌ వారీగా ప్రత్యేక కార్యాలయాలు పెట్టి నిర్దిష్ట కాలపరిమితితో అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. మోదీ దేశాభివృద్ధి కోసం ఒక మేనిఫెస్టో.. కూటమి తరపున చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ఒక మేనిఫెస్టో ప్రకటించారని వివరించారు.

UP: చివరి నిమిషంలో ఇదేం ట్విస్టు.. చనిపోయారనుకున్న సోదరీమణులు తిరిగొస్తే..


మూడు రోజుల్లో మేనిఫెస్టో ప్రకటిస్తా...

‘‘నేను పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఒక మేనిఫెస్టో రూపొందించా. 22 డివిజన్ లలో పర్యటించిన నేను అనేక ప్రధాన సమస్యలు గుర్తించాను. వాటిని దృష్టి లో ఉంచుకుని మరో మూడు రోజుల్లో నేను చేసే అభివృద్ధిని మేనిఫెస్టోలో ప్రకటిస్తా. మోదీ (PM Modi), చంద్రబాబులు (TDP Chief Chandrababu) విజన్ ఉన్న నాయకులు. వారు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తారు. నిన్న ప్రకటించిన కూటమి మేనిఫెస్టో ప్రజల కలలను సాకారం చేసేలా ఉంది. వికలాంగులు కోసం ముందు చూపుతో పెన్షన్ పెంచారు. పేద ప్రజలకు ఆసరాగా నిలిచేలా అనేక అంశాల్లో సబ్సీడీలు ప్రకటించారు’’ అని తెలిపారు.

AP Politics: జయరాం నాయుడు అరెస్ట్.. టీడీపీ నేతల ఆందోళన.. రణరంగంగా అనంత


హామీపై చర్చకు సిద్ధమా?

గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు. హామీలు అమలు‌ చేయడం చేతకాని జగన్... కూటమి పార్టీలపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయ వనరులను పెంచాలన్నా , పేదల ఆర్ధిక ప్రగతి పెరగాలన్నా కూటమి‌ అధికారంలోకి రావాలన్నారు. మోదీ, చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు‌చేసి చూపుతారని స్పష్ట చేశారు. 2019లో జగన్ ఇచ్చిన హామీలు అమలుపై ఒక్కో హామీపై చర్చకు వారు సిద్ధమా అని సవాల్ విసిరారు.


రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించి.. జగన్ తన ఆదాయాన్ని పెంచుకున్నారని ఆరోపించారు. ముందు‌చూపు, యువతకు మంచి భవిష్యత్తు అందించే మోదీ, చంద్రబాబులకే దేశంలో, రాష్ట్రంలో ప్రజల మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంతో అభివృద్ధి, సేవ చేసిన తనకు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అండగా ఉంటారని.. గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని సుజనా చౌదరి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Delhi: మణిపుర్ అల్లర్లు.. పోలీసుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ సీబీఐ ఛార్జ్‌షీట్

Godrej Family: 127 ఏళ్ల గోద్రెజ్ కుటుంబం విడిపోతున్నట్లు ప్రకటన

Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2024 | 11:46 AM