Share News

AP Elections 2024: టీడీపీ సూపర్ సిక్స్.. సూపర్ హిట్

ABN , Publish Date - Apr 28 , 2024 | 06:28 PM

కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మంత్రాలయంలో మార్పు వస్తోందని చెప్పారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, ఉరుకుందు ఈరన్న స్వామి ఆశీస్సులు మనకే ఉన్నాయని తెలిపారు.

 AP Elections 2024: టీడీపీ సూపర్ సిక్స్.. సూపర్ హిట్
Nara Chandrababu Naidu

కర్నూలు: కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మంత్రాలయంలో మార్పు వస్తోందని చెప్పారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, ఉరుకుందు ఈరన్న స్వామి ఆశీస్సులు మనకే ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో మంత్రాలయానికి అన్ని మంచి రోజులే వస్తాయని చెప్పారు.

రూ. 8 కోట్లతో మంత్రాలయం ఆలయాన్ని అభివృద్ధి చేశానని గుర్తుచేశారు. జగన్ నవరత్నాలు నవ మోసాలని విమర్శించారు. జగన్ మేనిఫెస్టోకు జనం జీరో మార్కులు ఇస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అని తెలిపారు. మంత్రాలయంలో తాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.


AP Elections 2024: ఏపీ రాజకీయాలపై జయప్రద ఇంట్రస్టింగ్ కామెంట్స్..

మన సభలు గలగల.... జగన్ సభలు వెలవెల పోతున్నాయని సెటైర్లు గుప్పించారు. ఆదివారం నాడు జిల్లాలోని కౌతాళంలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ(YSRCP)ని చిత్తు చిత్తుగా ఓడించేందుకు మంత్రాలయం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టికెట్ల విషయంలో సామాజిక న్యాయం పాటించానని చెప్పుకొచ్చారు.


Sharmila: సీఎం జగన్.. లాయర్ పొన్నవోలు మధ్య క్విడ్ ప్రోకో

వైసీపీలో ముగ్గురు రెడ్లు ఉన్నారని.. ఆదోని, మంత్రాలయం వైసీపీ అభ్యర్థులు అన్నదమ్ములు ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని ఈ ఎన్నికల్లో గద్దె దింపాలని పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో 7 అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. మంత్రాలయంలో తుంగభద్ర నది ప్రవహిస్తోంది. కానీ తాగు, సాగునీటి సమస్య జఠిలంగా ఉంది. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పైసా అభివృద్ధి చేయలేదన్నారు. తుంగభద్ర నదిలోని ఇసుకంతా దోచేశారని విరుచుకుపడ్డారు.


కూటమి వల్లనే మంత్రాలయం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఐదేళ్లలో ప్రజల జీవితాల్లో కొంతయినా మార్పు రాలేదన్నారు. సైకో జగన్ రాయలసీమకు ఒక్క పనైనా చేశారా అని ప్రశ్నించారు. జగన్‌కు నీటి విలువ తెలియదని.. నీరు లేక 80వేల మంది వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో జగన్ 102 ఇరిగేషన్ ప్రాజెక్టులను రద్దు చేసిన దుర్మార్గుడన్నారు.కర్నూలు జిల్లాలో సాగు, తాగు నీటికి శాశ్వత పరిష్కారం కోసం ఆర్డీఎస్‌కు రూ. 1,955 కోట్లు.. వేదవతికి రూ.1,942 కోట్లు కేటాయిస్తే.. జగన్ ఎందుకు ఈప్రాజెక్టులను పూర్తి చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు.


AP Elections: నీ అభిమానానికి ఫిదా.. చంద్రబాబు కోసం ఈయన ఏం చేశాడంటే..

2015లో గుండ్రేవుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని చెప్పారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టులను జగన్ గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. జగన్ 7 సార్లు కరెంటు బిల్లులు పెంచారని.. తాను అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు పెంచనని.. నాణ్యమైన కరెంటు ఇస్తానని హామీ ఇచ్చారు. నాసిరకం మద్యం అమ్ముతూ... ఆడబిడ్డల తాళి బొట్లను జగన్ తెంపుతున్నారని ఫైర్ అయ్యారు. మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు జగన్ ఇచ్చే నాసిరకం మద్యం తాగలేక పక్కన ఉన్న కర్నాటకకు వెళ్లి మద్యం తాగివస్తున్నారని చెప్పారు.


నిరుద్యోగులకు జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదని.. జే బ్రాండ్.. గంజాయి ఇచ్చారని ఆక్షేపించారు. జగన్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఏమైనా హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రి అవగానే నిరుద్యోగ భృతి ఇస్తా. పోలీసులకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మంత్రాలయంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. వాటిని మరమ్మతులు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.


AP Elections 2024: ఓటు ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు.. రండి ఇలా చెక్ చేసుకోండి!!

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 28 , 2024 | 08:54 PM