ABN Big Debate With CBN: అందుకే మోదీతో విభేదించా: చంద్రబాబు
ABN , Publish Date - May 08 , 2024 | 09:20 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనం కోసమే మూడు పార్టీలు కలిశాయని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) అన్నారు. ప్రపంచంలోనే లీడర్‌షిప్ లోటు ఉందని చెప్పారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ లీడర్‌గా ఎదిగారని చెప్పుకొచ్చారు. మన దేశాన్ని మోదీ ప్రమోట్ చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బాగు చేస్తామన్న నమ్మకం ఎన్డీఏ కూటమికి ఉందని తెలిపారు.
ABN Big Debate With CBN: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనం కోసమే మూడు పార్టీలు కలిశాయని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) అన్నారు. ప్రపంచంలోనే లీడర్‌షిప్ లోటు ఉందని చెప్పారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ లీడర్‌గా ఎదిగారని చెప్పుకొచ్చారు. మన దేశాన్ని మోదీ ప్రమోట్ చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బాగు చేస్తామన్న నమ్మకం ఎన్డీఏ కూటమికి ఉందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిందని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారని అన్నారు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో చంద్రబాబు నాయుడు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
గతంలో దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా తనకు సహకరించారని గుర్తుచేశారు. పాలసీల్లో మోదీ కచ్చితంగా సహకరిస్తారని చెప్పారు. గతంలో ఒక ఇష్యూపై మోదీతో విభేదించానని అన్నారు. ప్రత్యేక హోదా రాలేదని ఆందోళన కలిగిందని అన్నారు. విభజన కంటే జగన్ పాలనలో ఎక్కువ నష్టం కలిగిందని వివరించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్ నిర్మించడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. అందుకే మూడు పార్టీలు కలిశాయని చెప్పారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీపై దేశ ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.ప్రపంచంలోనే లీడర్‌షిప్ లోటు ఉందని అన్నారు. అదే సమయంలో మోదీ లీడర్‌గా ఎదిగారని చెప్పుకొచ్చారు. మన దేశాన్ని మోదీ ప్రమోట్ చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.