AP Election 2024: వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు: దేవినేని ఉమ
ABN , Publish Date - Apr 25 , 2024 | 10:10 PM
వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) అన్నారు. సీఎం జగన్ (CM Jagan), వైసీపీ నేతలపై ఎన్నికల సంఘానికి (Election Commission) తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం నాడు సచివాలయంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.
అమరావతి: వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) అన్నారు. సీఎం జగన్ (CM Jagan), వైసీపీ నేతలపై ఎన్నికల సంఘానికి (Election Commission) తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం నాడు సచివాలయంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. సీఈఓ మీనాను కలిసిన వారిలో దేవినేని ఉమ, టీడీపీ నేతలు ఏఎస్ రామకృష్ణ, పరుచూరి అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కోనేరు సురేష్ ఉన్నారు.వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రసాద్ రెడ్డిల వైఖరిపై ఫిర్యాదు చేశారు.
AP Elctions: ప్రశ్నించిన ప్రజలపై దాడులా?... కొడాలి అనుచరుల వీరంగంపై రాము ఫైర్
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ... ఎన్నికల అధికారులపై బెదిరింపులకు దిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల నియమావళి ఉల్లంగించిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ప్రసాద్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆర్వో, మహిళా రిటర్నింగ్ ఆఫీసర్, తహసీల్దార్లను సర్వీస్ ఉంది.. కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ.. ప్రవర్తించిన తీరు వైసీపీ నేతల బరితెగింపుకు నిదర్శనమన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చర్యలు తీసుకోమని ఈసీని కోరామని తెలిపారు.
AP Elections: ఒకేసారి ఆర్డీవో ఆఫీస్‌కు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు.. పరిస్థితి ఉద్రిక్తం
ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి చేసిన ఘనకార్యాలకు మూడోసారి వైసీపీ ప్రభుత్వం ఈయన్ను వీసీగా నియమించిందని చెప్పుకొచ్చారు. ఏం చేశారని ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా 800 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులను ప్రభావితం చేసే విధంగా నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. గతంలో కూడా సర్వేల పేరుతో పిల్లలను గ్రామాల్లోకి పంపినట్లు ఇతనిపై చాలా ఫిర్యాదులు ఉన్నాయని.. ఇతనిపై కూడా చర్యలు తీసుకోవాలని సీఈఓ మీనాను దేవినేని ఉమా కోరారు.
ఇవి కూడా చదవండి
Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
TDP: ఆ సమయంలో ఆస్తులు, స్థలాలపైనే జగన్ చూపు: పట్టాభి
Read Latest Andhra Pradesh News And Telugu News