AP Election 2024:ఐదేళ్లలో పరిశ్రమలను వైసీపీ దెబ్బతీసింది:పురంధేశ్వరి
ABN , Publish Date - May 11 , 2024 | 04:15 PM
ఏపీలో ఉన్న పరిశ్రమలను ఐదేళ్లలో వైసీపీ (YSRCP) ప్రభుత్వం దెబ్బతీసిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Purandeswari) అన్నారు. రాష్ట్రంలో కోళ్ల పెంపకం పెద్ద సంఖ్యలో జరుగుతుందని చెప్పారు. 2019కి ముందు కోళ్ల పెంపకానికి సంబంధించి రైతులకు ఇంట్రెస్ట్ సబ్సిడీ సౌకర్యం ఇచ్చేవారని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు వారికి ఇచ్చే సబ్సిడీ పూర్తిగా ఎత్తేశారని మండిపడ్డారు.
అమరావతి: ఏపీలో ఉన్న పరిశ్రమలను ఐదేళ్లలో వైసీపీ (YSRCP) ప్రభుత్వం దెబ్బతీసిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Purandeswari) అన్నారు. రాష్ట్రంలో కోళ్ల పెంపకం పెద్ద సంఖ్యలో జరుగుతుందని చెప్పారు. 2019కి ముందు కోళ్ల పెంపకానికి సంబంధించి రైతులకు ఇంట్రెస్ట్ సబ్సిడీ సౌకర్యం ఇచ్చేవారని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు వారికి ఇచ్చే సబ్సిడీ పూర్తిగా ఎత్తేశారని మండిపడ్డారు.శనివారం బీజేపీ కార్యాలయంలో పురంధేశ్వరి మాట్లాడుతూ.. గుడ్లకు సంబంధించి ట్రైలు తయారీ కూడా మన రాష్ట్రం, తెలంగాణలోనే ఉండేదన్నారు.
తెలంగాణలో ఉన్న చిన్న పరిశ్రమకు మాత్రమే ఆర్డర్స్ ఇస్తూ.. మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమను సీఎం జగన్ దెబ్బ తీశారని ధ్వజమెత్తారు. ఈ విషయంపై వైసీపీ పాలకులు, ప్రజాప్రతినిధులు అసలు పట్టించుకోలేదని మండిపడ్డారు.సమస్యకు పరిష్కారం చూపకుండా ఇబ్బందులు పెట్టారని అన్నారు. అనపర్తి, రాజమండ్రి, ఇతర నియోజకవర్గాల్లో కోళ్ల పెంపక పరిశ్రమ ఉన్న సందర్భంలో గతంలో ఇచ్చిన విధంగా సబ్సిడీని మళ్లీ పునరుద్ధరించే ఆలోచన చేస్తామన్నారు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా కోళ్ల ట్రేల తయారీకి ఆర్డర్లు వచ్చేలా కృషి చేస్తామని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.
AP Elections: వ్యాన్-లారీ ఢీ.. బయటపడిన అట్టపెట్టెలు.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్..!
Read Latest AP News And Telugu News