AP Elections: జగన్ ముందు ‘జై పవన్’ అన్నారని ఆ విద్యార్థులను ఏం చేశారంటే?
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:45 PM
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్ర పేరిట నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఇందులో భాగంగానే నిన్న (శుక్రవారం) జగ్గంపేట నియోజకవర్గంలోకి బస్సు యాత్ర చేరుకోగానే అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఆదిత్య కాలేజీ వద్దకు రాగానే అక్కడి విద్యార్థులు సీఎంను ఉద్దేశించిన చేసిన నినాదాలు హాట్ టాపిక్‌గా మారాయి.
కాకినాడ, ఏప్రిల్ 20: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్ర పేరిట నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఇందులో భాగంగానే నిన్న (శుక్రవారం) జగ్గంపేట నియోజకవర్గంలోకి బస్సు యాత్ర చేరుకోగానే అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఆదిత్య కాలేజీ వద్దకు రాగానే అక్కడి విద్యార్థులు సీఎంను ఉద్దేశించిన చేసిన నినాదాలు హాట్ టాపిక్‌గా మారాయి. జగన్ బస్సు ముందు విద్యార్థులు (Engineering Students) ‘‘జై జగన్’’ అని కాకుండా ‘‘జై పవన్’’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అయితే ఆ నినాదాలు చేసిన విద్యార్థుల పట్ల కాలేజీ యాజమాన్యం ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
AP Politics: చంద్రబాబు ఆస్తులు ఎంతో తెలుసా? ఆయనపై కేసుల లెక్క ఇదీ..!
యాజమాన్యం చర్యలు...
సీఎం జగన్ బస్సు ముందు నిన్న జై పవన్ అంటూ నినాదాల వ్యవహారం పట్ల ఆదిత్య కాలేజ్ యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సీఎం కాన్వాయ్ ఎదుట సరిగ్గా ప్రవర్తించనందున సస్పెండ్ చేస్తున్నట్టు లేఖలో పేర్కొంది. అయితే కాలేజీ యాజమాన్యం తీరుతో విద్యార్థులు, వారి తలిదండ్రులు లబోదిబోమంటున్న పరిస్థితి. ఇదెక్కడి న్యాయమంటూ విద్యార్థులు, పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు.
Chandrababu: భువనేశ్వరి క్యాంపు సైట్‌లో చంద్రబాబు జన్మదిన వేడుకలు...
అసలేం జరిగిందంటే..
నిన్న ముఖ్యమంత్రి జగన్ బస్సు జగ్గంపేట నియోజకవర్గం ఆదిత్య కాలేజీ వద్దకు రాగానే ఇంజనీరింగ్ విద్యార్థులు పెద్దఎత్తున గుమిగూడారు. జగన్‌కు అభివాదం చేసేందుకు కాలేజీ యాజమాన్యం వీరందరినీ రోడ్డుపై నిల్చోబెట్టింది. అయితే జగన్ బస్సు నుంచి కిందకు దిగుతుండగా అక్కడున్న విద్యార్థులంతా ‘జై పవన్...’ అంటూ నినాదాలు చేశారు. మరికొందరు అయితే ‘బాబులకే బాబు.. కళ్యాణ్‌బాబు’ అంటూ నినదించారు. దీంతో జగన్ ముఖం మాడిపోయింది. అక్కడి నుంచి వెంటనే బస్సులోకి వెళ్లిపోయారు ముఖ్యమంత్రి జగన్. అయితే ముఖ్యమంత్రి ముందు విద్యార్థులు ప్రవర్తించిన తీరు పట్ల యాజమాన్యం తీసుకున్న చర్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అన్యాయం విద్యార్థులను సస్పెండ్ చేశారంటూ విపక్ష నేతలు మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Kanakamedala Ravindra Kumar: అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టికి చంద్రబాబు ఒక బ్రాండ్...
ఒక్క చాన్సే చివరి చాన్స్ కావాలి! జగన్ నైజం దోపిడీ, విధ్వంసమే: చంద్రబాబు
మరిన్ని ఏపీ వార్తల కోసం..