AP Politics: నెల్లూరును క్లీన్ స్వీప్ చేసేందుకు ఆనం, సోమిరెడ్డి ఎత్తుగడలు..
ABN , Publish Date - Apr 01 , 2024 | 11:08 AM
Andhrapradesh: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్వీన్ స్వీప్ చేయాలని టీడీపీ గట్టి పట్టుదలతో ఉంది. ఆ విధంగా ప్రణాళికలు కూడా తెలుగుదేశం పార్టీ రూపొందింస్తోంది. అందులో భాగంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో మాజీ మంత్రి సోమిరెడ్డి భేటీ అయ్యారు. సోమవారం ఉదయం ఆనం నివాసానికి చేరుకున్న సోమిరెడ్డికి ఎమ్మెల్యే సాదర స్వాగతం పలికారు. అంతేకాకుండా ఆనం, సోమిరెడ్డి ఒకరినొకరు శాలువాలతో సత్కరించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరువురు నేతలు సుధీర్ఘ చర్చలు నిర్వహించారు.
నెల్లూరు, ఏప్రిల్ 1: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్వీన్ స్వీప్ చేయాలని టీడీపీ (TDP) గట్టి పట్టుదలతో ఉంది. ఆ విధంగా ప్రణాళికలు కూడా తెలుగుదేశం పార్టీ రూపొందింస్తోంది. అందులో భాగంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో (MLA Anam Ramnarayana Reddy) మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Former Minister Somireddy Chandramohan Reddy) భేటీ అయ్యారు. సోమవారం ఉదయం ఆనం నివాసానికి చేరుకున్న సోమిరెడ్డికి ఎమ్మెల్యే సాదర స్వాగతం పలికారు. అంతేకాకుండా ఆనం, సోమిరెడ్డి ఒకరినొకరు శాలువాలతో సత్కరించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరువురు నేతలు సుధీర్ఘ చర్చలు నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరులో పదికి పది అసెంబ్లీ, నెల్లూరు లోక్‌సభ స్థానం గెలిచి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కానుకగా ఇవ్వాలని నేతలు నిర్ణయించారు. టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులందరూ ఐకమత్యంగా పనిచేసి విజయం సాధించాలని ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చర్చలు నిర్వహించారు.
TS Congress: కాకరేపుతున్న ఆ నాలుగు స్థానాలు.. తెరపైకి కొత్త వ్యక్తి
కాగా.. వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరులో ఇప్పుడు ఆ పార్టీ నేతల జాడే లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో నెల్లూరును క్లీన్ స్వీప్ చేసి వైసీపీ విజయ దుందుబి మోగించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి జిల్లాలో కనిపించకుండాపోయింది. అందుకు జిల్లాలో కీలక నేతలు అంతా అధికారపార్టీకి గుడ్‌బై చెప్పేసి టీడీపీలో చేరిపోవడమే కారణం. ముఖ్యంగా బడా పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) టీడీపీలో చేరడం ఆ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చినట్లైంది. అలాగే గతంలో ఇదే జిల్లా నుంచి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరారు. దీంతో నెల్లూరు జిల్లాలో టీడీపీ కంచుకోటగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వైపు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. మరోవైపు ముఖ్యనేతల రాజీనామాతో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి జిల్లాలో ఒక్క సీటు కూడా రావడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Kesineni Chinni: వచ్చేది టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వమే
Acid Attack: నిద్రిస్తున్న వ్యక్తిపై అర్ధరాత్రి యాసిడి దాడి..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...