Ganta Srinivasa Rao: బీఆర్ఎస్‌లాగానే వైసీపీ కనుమరుగు కావడం ఖాయం
ABN , Publish Date - Apr 19 , 2024 | 09:03 PM
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీ లాగానే., ఏపీలో కూడా వైఎస్సార్సీపీ (YSRCP) కనుమరుగు కావడం ఖాయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలోని మధురవాడలో తన నూతన కార్యాలయాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు.
విశాఖపట్నం: తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీ లాగానే., ఏపీలో కూడా వైఎస్సార్సీపీ (YSRCP) కనుమరుగు కావడం ఖాయమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలోని మధురవాడలో తన నూతన కార్యాలయాన్ని శుక్రవారం నాడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో భీమిలి ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. అభివృద్ధి పేరుతో ఏపీని సీఎం జగన్ రెడ్డి అధోగతిపాలు చేశారని విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ అనే పార్టీ మునిగిపోయిన పడవ అని విమర్శించారు.
AP Elections: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఏర్పాట్లపై ఎస్‌ఈసీకి వర్ల రామయ్య లేఖ
రానున్న ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ కనుమరుగు కావడం ఖాయమన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఏ విధంగా ఉందో రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వం కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ఖాయమన్నారు. జిల్లాల వారీగా అనేకమంది ఎమ్మెల్యేలు ఎంపీలు టీడీపీలో చేరారని వివరించారు.
YS Sunitha: నేను ప్రజల ముందుకొస్తే.. వైసీపీ నేతల్లో వణుకు పుట్టి..
జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన వ్యక్తిత్వం నచ్చక టీడీపీ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రాజకీయంలోతనను ఎవరో ఏదో అంటే వాళ్లకి కౌంటర్ ఇచ్చే వ్యవహార శైలి తనది కాదన్నారు. రాజకీయంలో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉందని తెలిపారు. ఫోను చేసి భయభ్రాంతులకు గురిచేసిపార్టీలోకి చేరుతారనేది ఒక భ్రమ అన్నారు.. ఆ పని వైసీపీనే చేస్తుందని గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
YS Sharmila: ఇక్కడ ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకో దగ్గర ఎలా పనికొస్తాడు?.. గుమ్మనూరుపై షర్మిల ఫైర్
Balakrishna: టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు
మరిన్ని ఏపీ వార్తల కోసం...