AP Elections 2024: కూటమి మేనిఫెస్టోలో ఉద్యోగులకు తీపికబురు!
ABN , Publish Date - Apr 30 , 2024 | 03:58 PM
Andhrapradesh: టీడీపీ - జనసేన - బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలతో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బీజేపీ దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. టీడీపీ - జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశామని చెప్పుకొచ్చారు. ప్రజలను గెలిపించేందుకే తమ కలయిక అని స్పష్టం చేశారు.
అమరావతి, ఏప్రిల్ 30: టీడీపీ - జనసేన - బీజేపీ మేనిఫెస్టో (TDP-Janasena-BJP Manifesto) విడుదలైంది. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jenasena Chief Pawan Kalyan), బీజేపీ ముఖ్య నేతలతో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బీజేపీ (BJP) దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. టీడీపీ - జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశామని చెప్పుకొచ్చారు. ప్రజలను గెలిపించేందుకే తమ కలయిక అని స్పష్టం చేశారు.
AP Elections 2024: కూటమి మేనిఫెస్టో వచ్చేసిందహో.. అదిరిపోయిందిగా..!!
ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే తాము సర్దుబాటు చేసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉద్యోగులు చాలా నష్టపోయారన్నారు. ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద నిలబెట్టారన్నారు. ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ ఏం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉద్యోగుల్లో ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతామని తెలిపారు. పీఆర్సీ ప్రకటిస్తామని.. ఆలోగా ఇంటెరిమ్ రిలీఫ్ ఇస్తామని ప్రకటించారు. సీపీఎస్ రద్దు సమస్యపై కసరత్తు చేసి పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
AP Elections 2024: కూటమి మేనిఫెస్టోలో అదిరిపోయే స్కీమ్! ప్రతి కుటుంబానికి..
మేనిఫెస్టోలో ముఖ్య అంశాలు...
20 లక్షల మంది యువతకు ఉపాధి.
నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి.
మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.
తల్లికి వందనం ఒక్కో బిడ్డకు రూ. 15 వేలు.
స్కిల్ గణన చేపడతాం.
ఎంఎస్ఎంఈలకు ప్రొత్సాహాకాలు.
10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తాం.
మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం.
ఆడపిల్లల విద్యకు కలలకు రెక్కలు పథకం.. వడ్డీ లేని రుణాలిస్తాం.
అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు ఇస్తాం.
వలంటీర్లకు రూ. 10 వేలు జీతం.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల నుంచి కాపులకు దామాషా పద్దతిన రిజర్వేషన్లు అమలు చేస్తాం.
అగ్ర వర్ణ పేదలకు న్యాయం చేస్తాం.
ఇప్పటికే మంజూరైన ఇళ్ల పట్టాల్లో ఇళ్లు కట్టిస్తాం.
విజయవాడలో హజ్ హౌస్.
ఇవి కూడా చదవండి..
Manifesto 2024: ఊహించని రీతిలో పెన్షన్ల పెంపు.. మేనిఫెస్టోలో కూటమి ప్రకటన
Lok Sabha Elections: 'ప్రేమ దుకాణం'లో నకిలీ వీడియోల అమ్మకం.. కాంగ్రెస్‌పై మోదీ వ్యంగ్యాస్త్రాలు
Read Latest AP News And Telugu News
10th ఫలితాల కోసం క్లిక్ చేయండి...