Kodali Nani: పకడ్బందీగా గురి చేసి కొట్టారు.. కొడాలి నాని
ABN , Publish Date - Apr 14 , 2024 | 01:22 PM
సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ( CM YS Jagan ) ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ( CM YS Jagan ) ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు ప్రేరణతోనే ఎన్నికల సమయంలో దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. సీఎం జగన్ కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా వ్యూహంతోనే దాడి జరిగిందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని తుళ్లూరులో చంద్రబాబు చెప్పారనే విషయాన్ని కొడాలి నాని గుర్తు చేశారు. ఆ మాటలతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు సీఎంను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. చాలా పకడ్బందీగా వ్యూహం ప్రకారం గురి చూసి కొట్టారని వివరించారు.
Inter Exams: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ పరీక్షల ఫీజు వివరాలు ఇవే..
ప్రచారంలో కదలికల వల్ల గురుతప్పి కన్ను వద్ద తగిలింది. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్ గాయంతో బయటపడ్డారు. దాడిని ఖండించాల్సిన పెద్దలు సంస్కారహీనంగా సీఎం జగనే తనపై దాడి చేయించుకున్నారని చెబుతున్నారు. గుర్తింపు పొందిన తొమ్మిది సంస్థలు చేసిన సర్వేల్లో 125 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు స్థానాలు వస్తాయని తెలిపాయి. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు రాజకీయ నిరుద్యోగులు విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారన్న కక్షతో కొన్ని వర్గాలు కలిసి జగన్మోహన్ రెడ్డి పై దాడి చేశాయి.
- కొడాలి నాని, వైసీపీ నేత
Elections 2024: జగన్ పై రాయి దాడి.. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్..
ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయడానికి ప్రయత్నం జరిగిందంటే ఈ ఘటన వెనక చాలామంది పెద్దలు ఉన్నారని కొడాలి నాని అన్నారు. సీఎంకు తగిలిన రాయి మాజీ మంత్రి వెల్లంపల్లికి కూడా తగిలిందని, ఆయన సైతం గాయపడ్డారని చెప్పారు. ప్రధాని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు రోడ్ షోగా వెళ్లేటప్పుడు పగలైనా రాత్రయినా కరెంటు తీసేస్తారని వెల్లడించారు. ఆ విషయం సీఎంగా చేసిన చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.