Inter Exams: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ పరీక్షల ఫీజు వివరాలు ఇవే..
ABN , Publish Date - Apr 14 , 2024 | 11:48 AM
ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఇంటర్ ఫలితాల ( Education ) నేపథ్యంలో మే లో నిర్వహించనున్న ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫీజు వివరాలు వెల్లడించింది.
ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఇంటర్ ఫలితాల ( Education ) నేపథ్యంలో మే లో నిర్వహించనున్న ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫీజు వివరాలు వెల్లడించింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఈ నెల 18నుంచి 24 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఆన్సర్ షీట్ రీ-వెరిఫికేషన్ కోసం రూ.1300, ఆన్సర్ షీట్ రీ-కౌంటింగ్ కు రూ.260 ఫీజుగా నిర్ధారించారు. థియరీ సబ్జెక్టుకు రూ.550, ప్రాక్టికల్ పరీక్షకు రూ.250, బ్రిడ్జి కోర్స్ ఒక్కో సబ్జెక్టుకు రూ. 150 చెల్లించాలని తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన ప్రకటన విడుదల చేశారు.
Elections 2024: త్వరలో రాష్ట్రంలో సంచలన ఘటనలు.. ముందే పసిగట్టిన నెటిజన్లు..
ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4,61,273 మంది విద్యార్థులు హాజరవగా.. 3,10,875 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన బాలికలు 67%. సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 3,93,757 మంది విద్యార్థులు హాజరవగా.. 3,06,528 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 78. ఒకేషనల్ కోర్స్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 38,483 మంది హాజరవగా.. 23,181 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ పరీక్షకు 32,339 మంది విద్యార్థులు హాజరవగా.. 23,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే..
కాగా.. ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలను తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కమిషనర్ ఒకే సమయంలో విడుదల చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సెకండ్ ప్లేస్‌లో గుంటూరు, థర్డ్ ప్లేస్‌లో ఎన్టీఆర్ జిల్లా ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.