Share News

AP Election 2024: మాచర్ల అల్లర్లకు సహకరిస్తున్న పోలీసుల గుర్తింపు

ABN , Publish Date - May 15 , 2024 | 12:17 PM

Andhrapradesh: పోలింగ్‌ సమయంలో మాచర్లలో ఎలాంటి ఘటనలకు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. ఏజెంట్లను పోలింగ్ బూత్‌‌ల వద్దకు రానీయకుండా వైసీపీ నేతలు అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయితే మాచర్ల అల్లర్ల విషయంలో షాకింగ్ విషయం బయటపడింది. మాచర్ల అల్లర్లకు పలువురు పోలీసులే సహకరిస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు... మాచర్ల అల్లర్లకు సహకరిస్తున్న పలువురు పోలీసు సిబ్బందిని గుర్తించారు.

AP Election 2024: మాచర్ల అల్లర్లకు సహకరిస్తున్న పోలీసుల గుర్తింపు
Macherla Roits

అమరావతి, మే 15: పోలింగ్‌ (AP Elections 2024) సమయంలో మాచర్లలో ఎలాంటి ఘటనలకు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. ఏజెంట్లను పోలింగ్ బూత్‌‌ల వద్దకు రానీయకుండా వైసీపీ నేతలు అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయితే మాచర్ల (Macheral) అల్లర్ల విషయంలో షాకింగ్ విషయం బయటపడింది. మాచర్ల అల్లర్లకు పలువురు పోలీసులే సహకరిస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు... మాచర్ల అల్లర్లకు సహకరిస్తున్న పలువురు పోలీసు సిబ్బందిని గుర్తించారు.

Pawan Kalyan: మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్


పోలీసుల కదలికలను, డిపార్ట్మెంట్ యాక్షన్‌ను పలువురు కింది స్థాయి సిబ్బంది ఎప్పటికిప్పుడు పిన్నెల్లి మనుషులకు చేరవేసినట్లు తెలుస్తోంది. మాచర్లలో ప్రత్యేక పోలీసు బలగాల రాక, తనిఖీల విషయాన్ని వైసీపీ నేతలకు తెలిపిన ఏడుగురు పోలీస్ సిబ్బందిని గుర్తించినట్లు తెలుస్తోంది. పలువురు పోలీసు సిబ్బంది కాల్ డాటా ఆధారంగా ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు.

PM Narendra Modi: నేనలా అనలేదు.. హిందూ-ముస్లిం వివాదంపై మోదీ క్లారిటీ


పోలీసు స్టేషన్‌లో ఉండే సహాయకులు, కింద స్థాయి సిబ్బంది ద్వారా వైసీపీ నేతలు సమాచారం తెప్పించుకున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాత్రి తనిఖీల సందర్భంగా వైసీపీ గూండాలు తప్పించుకునేందుకు సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. వాట్స్ యాప్ డాటా, చాటింగ్, ఫోన్ కాల్ డేటా ఎవరి నుంచి ఎవరికి వెళ్లింది అనేదానిపై పోలీసు ఉన్నతాధికారులు వెలికితీసే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు లోతైన విచారణకు పోలీసు బాస్ ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

TDP: ఎస్పీకి, ఆయన ఫ్యామిలీకి మేమే రక్షణ కల్పిస్తాం: సుధారెడ్డి

PM Narendra Modi: నేనలా అనలేదు.. హిందూ-ముస్లిం వివాదంపై మోదీ క్లారిటీ

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2024 | 02:36 PM