AP HighCourt: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ABN , Publish Date - Apr 24 , 2024 | 04:59 PM
Andhrapradesh: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలయ్యే వరకు ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు 62 వేల మంది రాజీనామా చేశారని కోర్టుకు న్యాయవాది తెలిపారు. 900 మందిపై చర్యలు తీసుకున్నామని కోర్టుకు ఈసీ న్యాయవాది తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని ఈసీ న్యాయవాది వెల్లడించారు.
అమరావతి, ఏప్రిల్ 24: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల ( volunteers resignations) పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో (AP HighCourt) విచారణ జరిగింది. ఎన్నికలయ్యే వరకు ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు 62 వేల మంది రాజీనామా చేశారని కోర్టుకు న్యాయవాది తెలిపారు. 900 మందిపై చర్యలు తీసుకున్నామని కోర్టుకు ఈసీ న్యాయవాది తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని ఈసీ న్యాయవాది వెల్లడించారు.
AP Polls 2024: బొత్స తండ్రి సమానులా జగన్.. షర్మిల ఫైర్
రాజీనామాలు ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా ఉంటారని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి విస్త్రృత అధికారాలున్నాయని పిటిషనర్ న్యాయవాది పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు ఆధికారాలను వినియోగించవచ్చన్న న్యాయవాది తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఈసీకి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
APElections: సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు పెమ్మసాని ఎలా..
AP Elections: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. ఆ ఇద్దరూ ఎదురు తిరిగారు!
Read Latest AP News And Telugu News