Share News

AP Election 2024: ముస్లింల రిజర్వేషన్లపై వైసీపీది అసత్య ప్రచారమే: కేశినేని చిన్ని

ABN , Publish Date - May 09 , 2024 | 03:54 PM

బీజేపీ ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే మస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని.. వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) అన్నారు. ముస్లిం వర్గాలు కూడా సీఎం జగన్‌ను నమ్మే పరిస్థితిలో లేరని.. వారికి అన్ని విధాలా అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. నిన్న(బుధవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షోలో కూడా ముస్లింలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని తెలిపారు.

AP Election 2024: ముస్లింల రిజర్వేషన్లపై వైసీపీది అసత్య ప్రచారమే: కేశినేని చిన్ని
Kesineni Chinni

విజయవాడ: బీజేపీ ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే మస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని.. వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) అన్నారు. ముస్లిం వర్గాలు కూడా సీఎం జగన్‌ను నమ్మే పరిస్థితిలో లేరని.. వారికి అన్ని విధాలా అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. నిన్న(బుధవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షోలో కూడా ముస్లింలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం ద్వారా అభివృద్ధి, సంక్షేమంతో సుపరిపాలన అందిస్తామని చెప్పుకొచ్చారు.


AP Election 2024: జగన్ కుయుక్తులకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్

గురువారం ఏబీఎన్‌తో కేశినేని చిన్ని మాట్లాడుతూ... కూటమి పార్టీల విజయం ఇప్పటికే ఖరారై పోయిందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం టీడీపీ అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారని అన్నారు. నిన్న(బుధవారం) విజయవాడలో నిర్వహించిన రోడ్ షో లో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు కూడా పాల్గొన్నారని తెలిపారు. ఈ రోడ్ షో మంచి జ్ఞాపకాన్ని మిగిల్చిందని మోదీ ట్వీట్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. కాలికి గాయమైనా పవన్ కళ్యాణ్ ర్యాలీలో పాల్గొన్నందుకు ధన్యవాదాలని తెలిపారు.


AP Elections: పంపకాలు ప్రారంభం.. కండీషన్స్ అప్లై..!

ఏపీలో ఉన్న ప్రధాన సమస్యలను మోదీకి వివరించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో జగన్ ఒక్క ఛాన్స్ పేరుతో మాయ మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. బీసీలతో సహా అనేక వర్గాలు గత ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేసి గెలిపించాయని అన్నారు. నేడు వారందరూ మోసపోయామని గుర్తించారు కాబట్టే అందరూ టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు. అసలు టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని.. మొదటి నుంచి వారికి అండగా పార్టీ ఉందని తెలిపారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూటమి పార్టీలకు మద్దతుగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఈ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధిస్తోందని ప్రజలకు అర్థమైందని అన్నారు. ఎక్కడెక్కడ ఎంత మెజార్టీ అనేది ఆలోచన చేస్తున్నామని అన్నారు. మరో నాలుగు రోజుల పాటు ప్రజల్లో ఉంటూ.. వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారాలను తిప్పికొడతామని తెలిపారు. వైసీపీ నేతలకు ఓటమి ఖాయమని అర్థమైపోయిందని అన్నారు. అందుకే అసత్యాలను ప్రచారం చేసి, తమకు ఆపాదిస్తున్నారని కేశినేని చిన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

AP Elections: ఏపీ ఓటర్ల చూపు ఆ వైపేనా..?

CM Jagan: లండన్ పర్యటనపై జగన్‌‌కు సీబీఐ షాక్..

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2024 | 04:03 PM