AP Elections: మంత్రి పెద్దిరెడ్డి సొంత మండలంలో టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్
ABN , Publish Date - May 13 , 2024 | 07:10 AM
Andhrapradesh: ఏపీలో పోలింగ్ మొదలవక ముందే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో ఏకంగా టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేశారు వైసీపీ నేతలు. అది కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలోనే.
చిత్తూరు, మే 13: ఏపీలో పోలింగ్ (AP Elections 2024) మొదలవక ముందే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు (YSRCP) దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై (Agents) అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో (Chittoor) ఏకంగా టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేశారు వైసీపీ నేతలు. అది కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) సొంత మండలంలోనే. మంత్రి పెద్దిరెడ్డి సొంతూరు సమీపంలోని బూరగమాంద పోలింగ్ కేంద్రానికి వెళుతున్న ఐదు మంది ఏజెంట్లను, మరో పదిమంది టీడీపీ నాయకులను వైసీపీ కిడ్నాప్ చేసింది.
AP Elections 2024: పోలింగ్ ప్రారంభానికి ముందే వైసీపీ అరాచకాలు.. ఒక్కోచోట ఒక్కోలా..
వారిని పీలేరు శివారులలో వదిలిపెట్టిన పరిస్థితి. ‘‘మధ్యాహ్నం ఒంటిగంట వరకు మీరు పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్‌గా కూర్చోవడానికి వీల్లేదు’’ అంటూ కిడ్నాపర్లు బెదిరింపులకు కూడా దిగారు. ఏదైనా తోకాడిస్తే అంతు చూస్తామంటూ టీడీపీ ఏజెంట్లను బెదిరింపులతో హడలెత్తించారు. గతంలో సదుం మండలానికి చెందిన టీడీపీ ఆక్టివ్ నాయకుడు రాజారెడ్డిని వైసీపీ శ్రేణులు కాళ్లు విరిచి ఆసుపత్రిపాలు చేసిన పరిస్థితి తెలిసిందే. ఆ వ్యక్తి కూడా ఈరోజు కిడ్నాప్ చేసిన ముఖ్యుల్లో ఉన్నారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు... వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ శ్రేణులపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
ఇవి కూడా చదవండి..
AP Elections: జనసేన ఎంపీ అభ్యర్థి ముఖంపై సీల్ ముద్ర.. టీడీపీ ఆందోళన
Loksabha Elections: ఖమ్మంలో మాక్ పోలింగ్ ప్రారంభం
Read Latest AP News And Telugu News