Share News

Gudivada Amarnath: ‘వన్ సైడ్ విక్టరీ మాదే...మళ్లీ జగనే సీఎం’

ABN , Publish Date - May 16 , 2024 | 12:33 PM

Andhrapradesh: ‘‘వన్ సైడ్ విక్టరీ మాది...మళ్ళీ జగనే సీఎం’’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కంటే 1 సీటు అయినా వైసీపీ గెలుచుకుంటుందని.. 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల అవసరం ఉండే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని తెలిపారు.

Gudivada Amarnath: ‘వన్ సైడ్ విక్టరీ మాదే...మళ్లీ జగనే సీఎం’

విశాఖపట్నం, మే 16: ‘‘వన్ సైడ్ విక్టరీ మాది...మళ్ళీ జగనే సీఎం’’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) ధీమా వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కంటే 1 సీటు అయినా వైసీపీ (YSRCP) గెలుచుకుంటుందని.. 23 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల అవసరం ఉండే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల ఫలితాలను (Election Results) మూడు రాజధానులపై రెఫరెండంగా తీసుకుంటామన్నారు. కేంద్రంలో ఎవరికి మ్యాజిక్ పిగర్ దాటకూడదని కోరుకుంటున్నామన్నారు. తమ పార్టీ అవసరం ఉన్న కూటమి కేంద్రంలో ఉండాలని భావిస్తున్నామని తెలిపారు.

Rains: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు..


విశాఖలోనే సీఎం జగన్ (CM Jagan) ప్రమాణ స్వీకారం ఉంటుందని అన్నారు. ఏపీలో భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని... తిరిగి జగన్ సీఎం కావాలని వైసీపీ శ్రేణులు చాలా కష్టపడ్డారన్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా జగన్ కోసం ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు. పోలింగ్ శాతం పెరిగింది అని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ పడిందని ప్రచారం చేస్తున్నారని.. ఇది తప్పని చెప్పుకొచ్చారు. గతంలో మహా కూటమిలాగా... ఇప్పుడు కూటమి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఓర్వలేకే దాడులు జరుగుతున్నాయన్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో 85 శాతం లబ్ది పొందారని.. అందుకే తమ విజయంపై ధీమాగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ ప్రభావం ఏమీ ఉండదని... కేఏ పాల్ పార్టీ ప్రభావం ఎంతో... కాంగ్రెస్ ప్రభావం కూడా అంతే ఉంటుందంటూ గుడివాడ అమర్నాథ్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.


ఇవి కూడా చదవండి...

Amit Shah: పీవోకేని భారత్‌లో కలుపుతాం!

Chandrababu Naidu: మారిన చంద్రబాబును చూస్తారు

Read Latest AP News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 12:40 PM