Share News

AP Politics: వైసీపీ సైకో మూకలు జైలుకెళ్లడానికి సిద్ధం కావాలి: పట్టాభి రామ్

ABN , Publish Date - Jun 10 , 2024 | 03:26 PM

వైఎస్సార్సీపీ (YSRCP) సైకో మూకలు జైలుకెళ్లడానికి సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) హెచ్చరించారు. ప్రజలు మక్కెలు విరగొట్టి 11సీట్లతో మోకాళ్లపై కూర్చోబెట్టినా వైసీపీ నేతల అరాచకాలు ఆగడంలేదని ధ్వజమెత్తారు.

AP Politics: వైసీపీ సైకో మూకలు జైలుకెళ్లడానికి సిద్ధం కావాలి: పట్టాభి రామ్
Kommareddy Pattabhiram

విజయవాడ: వైఎస్సార్సీపీ (YSRCP) సైకో మూకలు జైలుకెళ్లడానికి సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) హెచ్చరించారు. ప్రజలు మక్కెలు విరగొట్టి 11సీట్లతో మోకాళ్లపై కూర్చోబెట్టినా వైసీపీ నేతల అరాచకాలు ఆగడంలేదని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత గిరినాథ్‌ను వైసీపీ సైకో మూకలు దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు.


నేడు(సోమవారం) అసెంబ్లీ మీడియా హాల్లో ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...టీడీపీ కార్యాయలంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టాభి రామ్ మాట్లాడుతూ.. టీడీపీ కార్యాకర్తలపై లెక్కలేనన్ని దాడులు చేశారని చెప్పారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రపై 22 సార్లు దాడి చేశారని దుయ్యబట్టారు. ఆనాడు వైసీపీకి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. చెన్నుపాటి గాంధీపై దాడిచేసి కన్ను పోగొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రగొండపాలెం, నందిగామలో చంద్రబాబు పర్యటనలపై దాడిచేశారన్నారు.


తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై చాలాసార్లు దాడి చేశారు... అప్పుడు వైసీపీ నేతలకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. తనపై దాడిచేసి తన బిడ్డను భయపెట్టినప్పుడు వైసీపీ సైకోలకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుందని స్పష్టం చేశారు. కూటమి పార్టీలు ప్రజాస్వామ్య పరిరక్షణ కట్టుబడి ఉన్నాయని ఉద్ఘాటించారు. తెలుగుదేశం హింసను ప్రేరేపించదు... చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను తమకు ఎప్పుడూ గుర్తు చేస్తారని వివరించారు. ఏపీలో ఎక్కడా భౌతికదాడులు జరగవు.. వైసీపీ నేతలు భయపడాల్సిన పనిలేదన్నారు. ఐసీపీ సెక్షన్ల పవరేంటో చూపిస్తాం.. తప్పు చేసిన వారిని వదిలిపెట్టామని వార్నింగ్ ఇచ్చారు. లోకేశ్ రెడ్ బుక్ రియాల్టీ ఏంటో చూపిస్తామని పట్టాభి రామ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

YSRCP: ఒక్కొక్కటిగా పడుతున్న వైసీపీ వికెట్స్.. నెల్లూరు మేయర్ రాజీనామా ప్రకటన

Amaravati: రాజధాని అమరావతిలో ఊపందుకున్న పనులు..

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 10 , 2024 | 03:29 PM