AP Elections: సీఎం జగన్ ఎన్నికల సభలో పలువురికి అస్వస్థత..
ABN , Publish Date - May 04 , 2024 | 03:48 PM
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల సభలో అపశృతి చోటు చేసుకుంది. శనివారం జిల్లాలోని పలమనేరులో సీఎం జగన్ సభ నిర్వహించారు. అయితే జగన్ సభకు హాజరైన ప్రజల్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సభకు వచ్చిన జనానికి వైసీపీ శ్రేణులు చల్లని పానీయాలు పంపిణీ చేశారు. అయితే వీటిని తాగిన పలువురకి అనారోగ్యం పాలయ్యారు. వాంతులు అవడంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
చిత్తూరు, మే 4: ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (CM Jagan mohan Reddy) ఎన్నికల సభలో (Elections Meeting) అపశృతి చోటు చేసుకుంది. శనివారం జిల్లాలోని పలమనేరులో సీఎం జగన్ సభ నిర్వహించారు. అయితే జగన్ సభకు హాజరైన ప్రజల్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సభకు వచ్చిన జనానికి వైసీపీ శ్రేణులు చల్లని పానీయాలు పంపిణీ చేశారు. అయితే వీటిని తాగిన పలువురకి అనారోగ్యం పాలయ్యారు. వాంతులు అవడంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుమారు 20 మందికి పైగా ప్రజలు వాంతులతో ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఈ వ్యవహారంపై అధికార వైసీపీ మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఓ విందు ఫంక్షన్ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులకు ఈ పరిస్థితి ఏర్పడిందంటూ బుకాయించేందుకు యత్నించారు.
AP Pensions: పండుటాకులపై పగబట్టిన జగన్ సర్కార్.. బ్యాంకుల చుట్టూ తిరిగినప్పటికీ.
మరోవైపు సీఎం సభ నేపథ్యంలో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలమనేరు పట్టడానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇరువైపులా బారికేడ్లు పెట్టారు. ఆ మార్గంలో వచ్చే వాహనాలను వేరే వైపుకు మళ్లించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ అవడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు.
ఇవి కూడా చదవండి..
AP Elections: చెల్లిని మిస్ అవుతున్నా.. కానీ షర్మిలపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
AIMIM: ఎంఐఎం ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యం.. పూజారి ఆశీర్వాదం తీసుకున్న అసదుద్దీన్..
Read Latest AP News And Telugu News