AP Elections: ఏం చెప్పాలో తెలీక కన్ఫ్యూజన్‌లో జగన్.. చంద్రబాబు సెటైర్
ABN , Publish Date - May 04 , 2024 | 02:31 PM
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం దర్శి ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒకమాట చెప్పి.. అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడుకు తెరతీశారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలకు జగన్ ఖర్చుపెట్టింది చాలా తక్కువే అని.. దీంతో ఏం చెప్పాలో తెలీక జగన్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు.
ప్రకాశం, మే 4: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై (CM Jaganmohan Reddy) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం దర్శి ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒకమాట చెప్పి.. అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడుకు తెరతీశారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలకు జగన్ ఖర్చుపెట్టింది చాలా తక్కువే అని.. దీంతో ఏం చెప్పాలో తెలీక జగన్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు. నవరత్నాలు పేరుతో జనాలను మోసం చేశారని.. ఇప్పుడు ఆ నవరత్రాలు రాలిపోయాయన్నారు. ‘‘సైకో జగన్‌ను ఇంటికి పంపించాలి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ అభిమతం... అందుకే జట్టు కట్టాం’’ అని టీడీపీ అధినేత తెలిపారు. 2047కు భారత్‌ను నెంబర్ వన్‌గా చేయాలనేది మోదీ సంకల్పమని స్పష్టం చేశారు.
BRS: ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు బిగ్ షాక్... ఆ కీలక నేతతో పాటు మరికొందరు నేతల రాజీనామా
ఎన్నికల ముందు ముద్దులు.. ఇప్పుడేమో..
ఐదేళ్లు పరదాలు కట్టుకుని జగన్ తిరిగారని... ఎక్కడికి వచ్చినా విధ్వంసం చేశారని.. చెట్లు నరికేశారని మండిపడ్డారు. ‘‘ఎన్నికల ముందు తల మీద చెయ్యి పెట్టాడు, ముద్దులు పెట్టాడు, బుగ్గలు నిమురాడు.. అధికారంలోకి వచ్చాక వీరబాదుడు బాదుతున్నాడు.. ఏం చేశామో? ఏం చేస్తామో? చెప్పుకోలేక జగన్ కన్ఫ్యూజన్‌లో పడిపోయాడు. నేను సంక్షేమ కార్యక్రమాలకు 19.1 శాతం ఖర్చు పెడితే.. జగన్ పెట్టింది 15.8 శాతం మాత్రమే... చెయ్యని పనికి జగన్ డబ్బాలు కొట్టుకుంటున్నారు’’ అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఎస్సీలకు 27 పథకాలు, బీసీలకు 30 పథకాలు, మైనార్టీలకు 10 పథకాలు రద్దు చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని అన్నారు. 10 రూపాయలు ఇచ్చి 100 దోచేశారన్నారు. జగన్ ప్రజల రక్తం తాగే రకమని... తాను రక్తం ఎక్కించే రకమన్నారు.
రాలిపోయిన నవరత్నాలు...
జగన్ నవరత్నాలు రాలిపోయాయన్నారు. జగన్ నవరత్నాలలో మొదటి రత్నం ఇసుక మాఫియా అని తెలిపారు.
‘‘నేను రాగానే ఇసుక మాఫియాను తుంగలో తొక్కేస్త... ఉచితంగా ఇసుక ఇచ్చే పూచి నాది’’ అని హామీ ఇచ్చారు.
రెండో రత్నం.. మద్యం మాఫియా...
‘‘జే బ్రాండ్ మద్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆడబిడ్డల తాళి తెంచేసే రకం ఈ సైకో జగన్.. జే బ్రాండ్ మద్యం రద్దు చేస్తా... మందు బాబుల ఆరోగ్యం కాపాడుతా’’ అని తెలిపారు.
మూడో రత్నం... భూ మాఫియా..
‘‘పట్టా దారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటోలు వేస్తున్నారు.. భూమి ఎవరిది... జగన్ తాత ఇచ్చాడా, వాళ్ళ నాన్న ఇచ్చాడా, మీ భూమి పైన జగన్ బొమ్మ ఏమిటి? చించి చిత్తు కాగితం చేసి చెత్త బుట్ట లో పారేయాలి.. మీ భూమి పైన ఈ సైకో పెత్తనం ఏమిటి? మీ భూములన్నీ జగన్ తన ఆన్లైన్ లో పెట్టుకుంటాడు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్... ఈ యముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు..మీ భూమి మీది కాదు ఇప్పుడు..జగన్ గుప్పెట్లో ఉంది. ఆయన ఒక ప్రైవేటు కంపెనీ పెట్టుకుని అందులో రికార్డులు అన్ని పెట్టుకుంటున్నాడు.. మీ రికార్డులు మార్చి వేస్తే మీ భూమి గోవిందా గోవింద.. భూమి మీది కానీ జలగ పెత్తనం.. మీ మెడలకు ఉరి తాడు వేశాడు.. ఇది నల్ల చట్టం.. జగన్ ల్యాండ్ గ్రాబ్బింగ్ యాక్ట్ ఇది.. మీ భూమి పైన కన్ను వేశాడు’’ అంటూ విరుచుకుపడ్డారు.
నాలుగవ రత్నం.. మైనింగ్ మాఫియా..
చీమకుర్తి గెలాక్సీ గ్రానైటును కొల్లగొట్టారు..
ఐదో రత్నం... హత్యా రాజకీయాలు..
ఆరో రత్నం.. ప్రజల ఆస్తులను కబ్జా చేయడం..
ఏడో రత్నం... ఎర్రచందనం, గంజాయి..
ఎనిమిదో రత్నం.. దాడులు , కేసులు..
తొమ్మిదో రత్నం... శవ రాజకీయాలు..
పిల్లోడిని పంపేది స్కూల్‌కు.. పార్లమెంట్‌కు కాదు..
2014లో తండ్రి లేని బిడ్డను అంటూ ప్రజల ముందుకు వచ్చి.. రిలయన్స్‌పైన దాడులు చేశారన్నారు. 2019 లో రిలయన్స్ మనిషికి రాజ్యసభ ఎంపీ ఇచ్చారన్నారు. 2019లో హూ కిల్డ్ బాబాయ్ తెరపైకి వచ్చిందన్నారు. బాబాయ్‌ను చంపిన వ్యక్తిని పక్కన పెట్టుకుని అమాయకుడని చెప్తున్నారని మండిపడ్డారు. బాబాయ్‌ను చంపిన అవినాష్‌కు ఎంపీ సీటు ఇచ్చారన్నారు. పిల్లోడు అయితే పలక బలపం ఇచ్చి ఎలిమెంటరి స్కూల్‌కు పంపించు అంతే కానీ పార్లమెంట్‌కు కాదు అంటూ సెటైర్ విసిరారు. 2019 లో కోడి కత్తి డ్రామా.. ఇప్పుడు గులక రాయి డ్రామా అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Google Doodle : తనను రెజ్లింగ్‌లో ఓడించిన వాడినే పెళ్లాడతానన్న ఈ ఆడ పహిల్వాన్ ఎవరు?
BRS: ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు బిగ్ షాక్... ఆ కీలక నేతతో పాటు మరికొందరు నేతల రాజీనామా
Read Latest AP News And Telugu News